తొండం లేకుండా వుండే నరముఖ వినాయక ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా? Naramukha Ganapathi temple - Adhi Vinayaka in Tamilnadu

నరముఖ వినాయక ఆలయం..!

తొండం లేకుండా వుండే ఆది గణపతి ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

ఎవరైతే పితృదోషాలతో బాధపడుతున్నారో..వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవలసిన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

Also Readశివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదా?

ఈ ఆలయం యొక్క పేరు. తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం.  ఈ ఆలయంలో సాక్షాత్తూ రాములవారు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. 

అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవటంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను 

కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టమని చెప్పిన స్థలం.అందుకనే ఈ ఊరిని "తిలతర్పణపురి" అంటారు. 

తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం.  అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో 

ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది. 

తిలతర్పణపురి..

ఇక్కడ రాములవారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో మారటం జరిగింది.  అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతూంది.

త్రివేణి సంగమం.

ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 

7 స్థలాలుగా చెప్పబడే..

కాశీ, 

రామేశ్వరం, 

శ్రీవాణ్యం, 

తిరువెంకాడు, 

గయ, 

త్రివేణి సంగమంతో 

సరిసమానమైన స్థలంగా చెప్పబడుతోంది.

దోషాల నుంచి విముక్తి..

అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూవుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు.

Also Read : తప్పుడు మాటలు మాట్లాడిన, హాని చేస్తున్న మీ బాధను అమ్మవారికి చెప్పి ఈ స్త్రోత్రం చదవండి

మరొక ప్రత్యేకత.

అంతేకాక ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే గణపతి. ఇక్కడ నరముఖంతో వున్న గణపతి వున్నారు.

బాలగణపతి. ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు.  ఇలాంటి ఆలయం చాలా అరుదుగా వుంటుంది.

నరముఖ గణపతి.

ఈ ఆలయం ముఖ్యంగా నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతితో చాలా ప్రసిద్ధి చెందినది.

ఆలయం ఎలా చేరుకోవాలి.

ఈ ఆలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలోను,  తమిళనాడులోని తిరునల్లార్శనిభగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలోను కలదు.

Famous Posts:


నరముఖ గణపతి, వినాయకుడు, aadi ganesha, ganesha with human head, adi vinayaka temple in tamilnadu, adhi vinayagar temple address, adi vinayaka temple tamil nadu, thilatharpanapuri, ganesh, wallpaper download, ganesh hd wallpaper, tamil nadu ganapathi temple, naramukha ganapathi temple history telugu

Comments