అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు లలితా సహస్త్ర నామంలో తెలిపిన వివరాలు..| Ammavari Naivedyam in Telugu

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సహస్త్ర నామంలో తెలిపిన వివరాలు..

లలితా సహస్త్ర నామంలో ఎన్నో సాధన రహస్యలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అవి ఏంటో తెలుసుకుందాము.

Also Readమౌనా వ్రతం ఎందుకు మరియు ఎప్పుడు చేయాలి?

1. గుడాన్నప్రీత మానసా:

 గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గుడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గుడాన్నం అంటే బెల్లం, బియ్యం కలిపి చేసే వంట. లలితామ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువ దోషం లేదు. రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం ముక్క పెట్టిన చాలు 

2. స్నిగ్ధౌదన ప్రియా:

స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియా అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థికార్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం.

3. పాయసాన్నప్రియా:

 క్షిరాన్నం పయః అంటే పాలు, అన్నం అంటే వండబడిన బియ్యం. పాలు, బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట. ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ. 

4. మధుప్రీతా:

మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది. ప్రీతా అంటే ఇష్టపడటం. తేనె వంటిపదార్థాలను ఇష్టపడటం అని బాహ్యార్థం. తేన గారెలు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం.

5. దద్ధ్యన్నాసక్త హృదయా:

దధి అంటే పెరుగు, అన్నం అంటే బియ్యంతో వండినది. ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం, హృదయా అంటే అంతటి మనస్సు కలిగినది. పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం. 

6. ముద్గౌదనాసక్త హృదయా:

ముద్గ అంటే పెసలు, ఓదనం అంటే అన్నం, ఆసక్త అంటే అభిరుచి కలిగిన, హృదయా అంటే మనసు కలిగిన అని అర్థం. ఆ తల్లికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు, పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం లో ఇది కూడా ముఖ్యమైనది.

7. హరిద్రాన్నైక రసికా:

 హరిద్రం అంటే పసుపు, అన్నం అంటే బియ్యంతో వండినది. మనం మన పరిభాషలో పులిహోరగా పిల్చుకుంటాం.ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ. అందుకే హరిద్రాన్న + ఏక అంటున్నాం. ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి క్రమంగా పులిహోర నివేదించి ప్రసాదం గా స్వీకరించడం పంచడం లాంటివి చేస్తుంటే వారిని జేష్ఠదేవి బాధించదు జేష్ఠ దేవి పెట్టే బాధలు తొలగి శుభం కలిగిస్తుంది.

8. సర్వౌదనప్రీతచిత్తా: (కదంబం)

 సర్వ అంటే అన్నిరకాల, ఓదనం అంటే అన్నం, ప్రీత అంటే ఇష్టపడటం, చిత్తా అంటే మనసు కలిగి ఉండటం. అన్నిరకాల  ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగినది తల్లి అని అర్థం. అన్నిరకాల కాయగూరలు , బియ్యం, తో చేస్తారు.

Also Readజీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయండి.

తయారీ ∙కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి ∙బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడగాలి ∙కుకర్‌లో బియ్యం, కందిపప్పు, తరిగిన కూరగాయ ముక్కలు (టొమాటో వేయకూడదు), తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, టొమాటో తరుగు వేసి దోరగా వేయించాలి ∙ చింతపండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి ∙సాంబారు పొడి వేసి మరిగించాలి ∙బాగా ఉడికిన తరవాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం, కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి ∙ చివరగా కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి ∙వేడి నెయ్యి జత చేసి, అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం.

ఇవి ఇస్తామని సహస్త్రనామం లో ఉన్న మాట నిజమే అయినా మీ శక్తి కొద్దీ భక్తితో ఏది సమర్పించిన తృప్తిగా నా తల్లి స్వీకరిస్తుంది ఇవన్నీ పెట్టగలిగే స్థితిలో మీరు నిండుగా ఉండాలి అని ఆ తల్లి స్త్రోత్రం లో పలికిస్తున్నదే తప్పా ఆత్మ నివేధన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, devi navaratri prasadam list in telugu, naivedyam recipes, ammavari naivedyam in telugu, navratri naivedyam for 9 days in telugu, navaratri naivedyam, navratri prasadam list for nine days, amman prasadam recipes, navratri prasadam list for nine days

Comments