ఈ సమయంలో పూజ చేస్తే శివుడు మనస్సు మీ మీద పడుతుంది. | Pradosha Puja - Lord shiva - Pradosham Benefits

సాధారణంగా మనకు రోజులో పూర్వసంధ్య, మాధ్యమిక సంధ్యా, ఉత్తర సంధ్యా చాలా విశేషమైన కాలాలు, అందులో పూర్వ, ఉత్తర సంధ్యలు సంధ్యావందనాధుల కశ్చితంగా చెయ్యాలి, ఇక అందునా ఉత్తర సంధ్యా ఆతర్వాత చెసే ప్రదోషపూజ చాలా విశేశం అవింది. ఒక్కకచో పూర్వసంధ్యా (సూర్యోదయం) సమయంలో పడుకొని ఉన్న మహా పాపం ఐతే కాదు కాని ఓకేవేల ఉత్తర సంధ్యా, ప్రదోష సమయాల్లో (సూర్యాస్తమయం తర్వాతి 3 ఘడియలు- 3*24=72 ని!!) ఈశ్వరారదన చెయ్యనివాడు, మనుష్య ఉపాదిలోకి వచ్చి గొప్ప అవకాశాన్ని చేజార్చుకునవాడు అవుతాడు.

Also Readశివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదా?

ప్రదోషానికి అంత విలువ ఎందుకు అంటే శివుడు ఆ సమయంలో వృషభారూఢుడై ఆకాశంలో తిరుగుతూ భూమండలంలో కొన్నికొన్ని ప్రదేశాల్లో దిగుతాడు, అదే శ్రీశేలం వంటి ప్రదేశంలో, తర్వాత నటరాజ మూర్తిగా చిదంబరంలో చిత్ సభలో ఆనంద తాండవం చేస్తాడు అని పురాణం చెపుతుంది. ఆ సమయంలో సమస్త దేవతలు ఈశ్వర నృత్యానికి అనుగుణంగా ఏదో ఒక వాయుధ్యాలు చేస్తారు, బ్రహ్మ, విష్ణువులు కూడా తాళాలు వాయిస్తారు, అందరూ ఈశ్వరుడి నృత్యం చూస్తూ పరమ పారవశ్యంలో వుంటారు, ఇక మనం పిలిచిన పలకరు, అందుకే ప్రదోషం అంటే శివారాధన కొరకే.

ప్రదోషం అంటే అంత గొప్ప సమయం, అందునా ప్రదోష సమయంలో వెళ్ళ వలిసిన ఏకైక దేవాలయం ఒక్క శివాలయమే, ఎందుకు అంటే అందరూ దేవుళ్ళు ఒకేచోట చూసే భాగ్యం అప్పుడు శివాలయంలో కలుగుతుంది. అప్పుడు అందరూ శివుని నృత్యంలో తాదాప్యత చెంది పరమ సంతోషంతో వుంటారు.

అందుకే ప్రదోషం సమయం లో పూజ, శ్రీరుద్ర పఠనం, లేదా శివ అష్టోత్తర శతనామావళి, కనీసంలో కనీసం శివ నామస్మరణ చెయ్యాలి, ఇది చెయ్యకపోతే మనుష్య జన్మలోకి వచ్చి గొప్ప అవకాశాన్ని జరవిడుచుకున్నవాడు అవుతాడు.

ప్రదోష సమయంలో తినటం, తాగటం, మాటడటం నిషిద్ధం, ఇక ఆ సమయంలో తమో గుణ రాజోగుణ సంభందమైనవి చేయటం, ఆలోచించటం, లఘు, దీర్ఘ శంకలు, కామానికి సంభందించిన విషయాలు చేయటం మహా పాపాల కింద్రాకు వస్తాయి.

హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అంతటి రాక్షసులు ఏ కారణంగా పుట్టారు అంటే వారి తల్లి దితి తన భర్త ఆవిన కశ్యక ప్రజాపతిని ప్రదోషసమయంలో చేరి భోగం అనుభవిద్దాం అని ప్రేరేపిస్తుంది, కశ్యపుడు మహజ్ఞ్యాని, సప్తరుషుల్లో ఒకరు ఆవిన చెపుతాడు, దానివల్ల లోక కంఠకులు, ధర్మ విరుద్ధంగా ఉండేవాళ్ళ, విష్ణు ద్వేషులు పుడతారు అని, ఐనా సరే నా కోరిక తీరాల్సిందే అని ఆవిడ పట్టు బట్టటం తో వారు సంగమించారు, అందుమూలంగా శివుడికి అపచారం జరిగింది, జగములు ఎలే సర్వేశ్వరుడు భూమిమీద పయనిస్తుండగా మనం నమస్కారం చేయకపోవడం ఒక తప్పు, ఇక కామం, రతి క్రీడలు ఆడటం మహా నేరం, అది ఆ సమయంలో నిషిద్ధ కర్మ, ఈశ్వరుడి పక్కన ఉన్న రుద్రాగణంలో భద్రాబాధ్రులు చూసి దానికి ఫలితంగా లోకకంఠకులు మహా రాక్షసులు పుట్టేలా ఫలితాన్ని ఇచ్చేసారు.

అందుకే అసురసంధ్య వేల లైట్స్/దీపం పెట్టాం పక్క నుండి లే అని పెద్దలు చెపుతారు, ప్రేదోషం ఉగ్రవేళ అంత గొప్పది, మనం పూజలు చేయకపోయినా పర్వాలేదు కానీ అపచారాలు చేసి శిక్షలు, పాపాలు మూటకట్టుకో కొడదు అని పెద్దలు చెప్పేవారు.

Also Readజీవితంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అంటే ఇలాంటి పొరబాట్లు చేయండి.

ఏరి? ఇప్పుడు కాలంలో ఉద్యోగులు అంటూ, కాలిగా ఉన్నవారు అంత చేసేపని సూర్యాస్తమయంలో లేదా సూర్యాస్తమయం కాగానే ఆకలి, టీ, టిపిఫ్, ఇలాంటివి చేస్తూ మరింత పాపం మూతకట్టుకుంటున్నాము. ఇక ఎప్పుడైనా సెలవు దొరికితే ఆ సమయంలో సినిమా, నిద్ర, భోగాలు అవి మహా పాపాలతో సమానం ప్రదోషానికి శివపూజ/నామస్మరణ జరిగితే వాడికి జన్మలుకూడా ఎక్కువ తీసుకొడు.

అందునా శివ అష్టోత్తర శతనామావళి లాంటివి కంఠతః నేర్చుకొని చదువుకున్నవారు ధన్యులు, కారణం అవి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు పార్వతిమాతకు ఉపదేశం ఇచ్చాడు, అవి పఠించి అమ్మవారు శివుడిలో అర్ధభాగం పొందింది.

Pradosha Puja, pradosha pooja benefits, pradosha pooja in telugu pdf, pradosha pooja vidhi telugu, lord shiva, siva temples, siva pooja pradosha time, శివుడు

Comments