కొబ్బరి నూనెతో దైవారాధన చేస్తే కలిగే శుభఫలితాలు - Types of Deepam and their benefits - Coconut Oil Lamp Benefits

కొబ్బరి నూనెతో దైవారాధన చేస్తే ---!!

కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారాయణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది.

కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.

మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి.

ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారని నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.

పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.

ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు.

హరిద్వార్లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది.

ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

కొబ్బరి నూనె, coconut oil lamp benefits, coconut oil deepam benefits in telugu, coconut lamp benefits, mustard oil deepam benefits, coconut oil deepam benefits in tamil, mahua, oil deepam benefits, pancha deepam oil benefits, pancha deepam oil ingredients

Comments