కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా అయితే వాస్తు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి - Vastu Guidelines for Your New Home


మెట్ల క్రింద బాత్రూమ్ :-

మెట్ల క్రింద బాత్రూమ్ ఎట్టిపరిస్థితులలో నిర్మించ వద్దు ,చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మెట్ల క్రింద స్థలం ఊరికే ఉండి పోతుంది కదా అని నిర్మిస్తుంటారు. మెట్ల క్రింద బాత్రూమ్ యే కాదు కనీసం స్టోర్ రూమ్ కూడా ఉండరాదు, అసలు మెట్ల క్రింద ఏమి ఉండకూడదు.తెలిసి చేసిన , తెలియక చేసినా అది పూర్తీ వాస్తు విరుద్ధం అవుతుంది, దాని వలన ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి.

Also Readకల్కి అవతారం ఎప్పుడు వస్తుందో ఎలా ఉండబోతుందో తెలుసా ?

ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులు ఉండవచ్చునా :-

ఇంట్లో, వ్యాపార సంస్థలలో విరిగిన, పగిలిన ఏ వస్తువైననూ ఉండటం శ్రేయష్కరం కాదు, అవి ఎంతటి కరీదైనను వాటిని ఇంట్లో నుండి తీసివేయాలి.

బెడ్‌రూమ్‌కి దక్షిణంలో డక్ట్ (హోల్) ఉంటే సమస్యలొస్తాయా :-

ప్రస్తుత కాలంలో కట్టే కొత్త అపార్ట్‌మెంట్లకు ఎలాంటి డక్టులు అవసరం రావడం లేదు. కారణం ప్రతి ఫ్లాటుకు చుట్టూ ఓపెన్ ఫ్లేస్ వదిలి కడుతున్నారు. తద్వారా వెంటిలేషన్ డ్రైనేజీ లైన్ల డక్టుకు ఆటోమేటిక్‌గా స్థలం దొరుకుతుంది, కాబట్టి ఇబ్బందులు రావు. దక్షిణంలో నైరుతిలో డక్టులు రావడం మంచిది కాదు. అలా ఇవ్వాల్సి వస్తే వాటిని చాలా పెద్దగా సూర్యరశ్మి పడేలా వదలాలి. కేవలం పైపులు పొయ్యే చీకటి బావులుగా నిర్మించవద్దు. తద్వారా ఇంటికి నీచస్థానంలో కూపాలు తయారవుతాయి. అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లోకి ప్రధానంగా టాయిలెట్లలోకి ఆక్సీజన్ అందదు. స్త్రీలు, పిల్లలు తరచూ అనారోగ్యాలతో అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటి ఇళ్ళలో ఉండే కంటే ఇల్లు మారితే మంచిది.


పిరమిడ్స్ :-

పిరమిడ్ నిర్మాణం ఎంతో గొప్పది. నిర్మాణ రంగంలో ఒక అత్యద్భుత శక్తియుక్తులు మానవమేధకు అందించే సృష్టి రహస్య విజ్ఞానం పిరమిడ్‌లో ఉంటుంది. ఏ ఇంధనం లేకుండా ఏ ఇంజిన్ లేకుండా మన ప్రాచీన నిర్మాణ కళ అలా ఎన్నో అద్భుతాలు చేసింది. శిలలపైన రాగాలు పరికించే శబ్ద సాంకేతిక విద్య. ఇనుప స్తంభాలను వందల సంవత్సరాలుగా తుప్పు పట్టకుండా తయారు చేసిన లోహ రసాయన విద్య ఏళ్లుగా అజంతా గుహల్లో రంగు రాలిపోని అద్దకపు మహిమ మన భారతీయ మేధావులది. ఆ కోణంలో దిశకు ఉన్న స్థలంలో సమ కొలతల విధానంలో నిర్మించే పిరమిడ్ ఆరోగ్య ప్రధాత అవుతుంది. దానిని గృహం పైన ప్రత్యేక విధానంలో నిర్మించుకోవడం దోషం ఎంత మాత్రం కాదు. అయితే దానిని సశాస్త్రీయంగా ఇంటిపైన నిర్మించవచ్చు. అవి ఎన్ని అనేది లేదు. ప్రతి నడక గది మీద కూడా ఏర్పాటు చేయవచ్చు అవసరాన్ని బట్టి. పిరమిడ్ మానవ శక్తిని ఇనుమడింపజేస్తుంది. ప్రకృతిలోని నెగిటివ్‌ ఫోర్స్‌ని రద్దు చేసి స్వశక్తికి మరింత ఊతమిస్తుంది. మన ప్రతి గుడిగోపురం ఒక పిరమిడే.

Also Readశకునాలు-నమ్మకాలు - ప్రయాణానికి శుభ శకునాలు - అశుభ శకునాలు

దక్షిణం ముఖము గల షాపులో స్టోరేజ్ ఎక్కడ పెట్టాలి :-

చాలా వ్యాపార సంస్థలలో స్టోరు తప్పక అవసరం అవుతూ ఉంటుంది. అందుకు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. షాపు పెద్దగా ఉండి అనుకూలంగా రోడ్డు ఉన్నప్పుడు ఏ షాపునకైనా దక్షిణ నైరుతిలో స్టోర్ చేసుకోవచ్చు. వీధి ఎటు ఉంటే అటు ఓపెన్ పెద్దగా వస్తేనే షాపు ఎలివేట్ అవుతుంది. స్టోర్ పెట్టాలి అంటే షాపు తూర్పు, పడమరలు ఎక్కువ కొలత కలిగి ఉంటే పడమరలో గదివేసి అందులో స్టోర్ చేయవచ్చు లేదా దక్షిణం ఫేసింగ్ కాబట్టి దక్షిణంలో ఫ్లోర్ వేసి దాని మీదకు ఉత్తర వాయవ్యం నుండి మెట్లు పెట్టుకొని అక్కడ స్టోర్ పెద్దగా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే షాపు దక్షిణం ఉత్తరం పొడవు ఉంటే ఉత్తర వాయవ్యంలో స్టోర్ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. దక్షిణం ఫేసింగ్ షెట్టర్‌తో తూర్పు ముఖంగా కూర్చొని వ్యాపారం చేయవచ్చు.


దక్షిణం బాల్కనీకి గ్రిల్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది:-

ఇంటికి దక్షిణం బాల్కనీ ఉన్నప్పుడు దానిని మూయాల్సిన అవసరం ఏముందనేది ముందు ఆలోచించాలి. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చే మార్గాలను అనవసరంగా మూయకూడదు. గ్రిల్ వేసుకోవచ్చు. దానివల్ల ఇంట్లోకి వెలుగు వస్తుంది, రక్షణగాకూడా ఉంటుంది. దక్షిణం మొత్తం మూయాలనుకుంటే గ్రిల్ మాత్రమే వేయండి. గోడ కట్టి మూయవద్దు. ఇల్లు పెరగడం కోసం దక్షిణం మూయడం చేయవద్దు. కేవలం కోతులు రాకుండా లేదా సెక్యురిటీ కొరకు అయితే గ్రిల్ వేయడం తప్పుకాదు. దక్షిణం గ్రిల్ వేస్తే పడమర కూడా గ్రిల్ వేయాల్సి వస్తుంది. దక్షిణం ఓపెన్ మీకు సమస్య అయినప్పుడు పడమర కూడా అంతే అవుతుంది.


ఇంటి ప్రహరీ గోడకు ఇంటికి మద్య పెంపుడు జంతువులకు చిన్న రూమ్ ఉండోచ్చా :-

శాస్త్ర ప్రకారం ఇంటిపై పొరుగింటి నెగిటివ్ ఎనర్జీ పడకూడదు అనే ప్రహరీ గోడ కడతాం. ప్రహరీ గోడను ఆనుకుని మెట్లు కాని, స్టోర్ రూమ్ కాని, పెంపుడు జంతువులకోసం రూమ్ కాని, వాచ్ మెన్ కోసం గది కాని నిర్మించ వద్దు. ఇంటి వాస్తుకి, పతకానికి దెబ్బతీస్తుది.


మాస్టర్ బెడ్ రూం (నైరుతి) లో క్రింద పడుకో వచ్చునా :- 

నైరుతి రూమ్ ను మాస్టర్ బెడ్ రూమ్ గా  ఏర్పాటు చేసుకుంటాం. ఆ గదిలో యజమాని క్రింద పడుకోకూడదు. మంచాలు  లేకపోతె ఏదైనా ఎత్తుగా ఏర్పాటు చేసుకుని దానిపై పడుకోవాలి. యజమానే కాదు నైరుతిలో ఎవరు క్రింద పడుకోవద్దు.

Also Readశివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదా?

వంట గదిలో పూజా రూమ్ ఉండవచ్చునా :-

ఇంట్లో విశాలమైన స్థలం లేనప్పుడు వంటగదిలో పూజా గది ఏర్పాటు చేసుకోవచ్చును కాని పూజ మందిరం నకు తలుపులు లేకుండా ఓపెన్ గా మాత్రం ఉండరాదు, కనీసం కర్టెన్ అయిన తప్పక ఉండాలి.

ఇంట్లో, షాపులో ఏ దిశ నుండి ఊడ్చడం (చిమ్మడం) ప్రారంభించాలి :-

ఇంట్లో అయినా వ్యాపార సంస్థలో అయిన మొదట ఈశాన్యం భాగం  నుండి తుడుచుకోవాలి. ఇల్లు చిమ్మిన చీపురు మాత్రం ఇంటికి వచ్చిన అతిధులకు కనబడకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

Famous Posts:


వాస్తు ప్రకారం గృహనిర్మాణం, వాస్తు నియమాలు, vastu shastra for house, vastu tips for happy home, basic vastu for home, vastu shastra tips, free vastu tips for home

Comments

  1. where we can use puja space for a north entrance flat

    ReplyDelete

Post a Comment