గుడిలో శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా? Why is Satagopam used in temples? What is the significance of Satagopuram?

దేవాలయంలో దర్శనం సమయం లో శఠగోపం పెట్టించుకుంటారు దానితో ఫలితమేమిటి?

శఠగోపం అంటే ఏమిటో అని చాలామందికి సందేహం. ముందు శఠగోపం అంటే ఏమిటో అర్థం తెలుసుకుందాం. దీనిని శడగోపం అనీ, శఠగోపురం అనీ చాలామంది అంటున్నారు. ఇది సరికాదు. దీనిని శఠకోపం అనాలి.

దక్షిణ దేశపు భక్తాగ్రేసరులలో ఆళ్వార్లు పన్నెండుమంది ఉన్నారు. ఆళ్వార్లు అంటే భగవదనుభవంలో పూర్తిగా మునిగిన వారు అని అర్థం. ఆళ్వారులలో నమ్మాళ్వారు అనువారు ప్రముఖులు. వీరికి శఠకోపులు అని పేరు.

శఠానాం బుద్ధి దూషణం. శఠులైన వారి బుద్ధిని నిరసించేవారు అని అర్థం. శఠులంటే వంచకులు. మాయమాటలు చెప్పి మోసం చేసేవారు. అట్లాంటి వారిని కోపగించుకుని, వారి మాటలను తమ వాక్కులతో ఖండించేవారు. కనుక ఈ ఆళ్వార్లకు శఠకోపులనే సార్థకనామం వచ్చింది.

శ్రీవారికి వీరు పాదుకల వంటివారు. ఇలా శ్రీహరి పాదుకలకు శఠకోపం అని పేరు స్థిరపడింది. శఠకోపానికి శఠారి (శఠమునకు శత్రువు) అని కూడా పేరు. క్రమంగా ఒక్క విష్ణువు యొక్క ఆలయాలలోనే గాక ఇతర దేవతల ఆలయాల్లో కూడా ఈ శఠకోపం వచ్చింది.

ఇప్పుడు ఆలయాల్లో అర్చకులు మన తలపై ఉంచేది నమ్మాళ్వారు తలపై దాల్చిన విష్ణుపాదుకలే.

శఠగోప్యం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట. పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోప్యము. అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోప్యం తప్పక తీసుకోవాలి.

చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోప్యం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.సహజంగా చిల్లర లేకపోవటం వల్ల, శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము. ప్రక్కగా వచ్చేస్తాము. అలా చెయ్యొద్దు. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి.

మనసులోని కోరికను స్మరించుకోండి. శఠగోప్యమును రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. శఠగోప్యమును తలమీద ఉంచిన ప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వార శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపం అని కూడా అంటారు.

Famous Posts:

Tags : satagopam in english, satagopam price, satagopam in telugu, sadari in vishnu temples, city of temples in india, Satagopam Significance in Telugu, Satagopam, శఠగోపం.

Comments