దేశవ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది.  కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది - CBSE Board Exams News LIVE Updates: Class 10th Board

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

‘‘దేశంలో మహమ్మారి ఉద్ధృతి.. పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు. పదో తరగతి విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా మార్కుల కేటాయింపు జరుగుతుందన్న కేంద్రమంత్రి.. ఫలితాలపై అభ్యంతరాలుంటే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత అనువైన సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

cbse 10th exam time table 2021, cbse exam date 2020 class 10, is board exam cancelled for 2021 class 10, are cbse board exams cancelled 2021, will board exams be cancelled in 2021, cbse exams 2020, will board exams be cancelled in 2021 due to covid, cbse latest news for class 10

Comments