పెళ్ళి లో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు - Why does the girl's father pay for the wedding?

పెళ్ళి లో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు అంటే, ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలి అనుకుంటే వాడే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఈయన కన్యాదానం చేస్తున్నాడు.కాబట్టి ఆ వేదిక ఆయనది.కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనది. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది.

ఆయన దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మీరు, మగపిల్లాడు,అతని తల్లిదండ్రులు.నీకు ఎంత కొడుకే పుట్టినా,వాడు ఎంత వంశోద్ధారకుడే అయినా,వంశాన్ని ఉద్ధరించి నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు.ఇప్పుడు వాడు వంశోద్ధారకుడు,అంటే వంశాన్ని ఉద్ధరించిన వాడు అయ్యాడా?ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న నీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఆ ఔదార్యాన్ని చూసి ముక్కున వేలు వేస్కోవద్దు?

కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన నీకు అధికారం ఎక్కడిది దానం ఇచ్చే వాడి మీద పడి అరవాడనికి,విసుక్కోవడానికి?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం లేదు.ఏ అశ్వమేధ యాగం లాంటి మహా యాగాలలోనో తప్ప.ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే.నీకు నీ ఇంటి లక్ష్మిని 20 యేళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచుకుని ఇస్తున్నారు.ఇంకేం కావాలి నీకు?

సీతారాములలా ఉండండి సీతారాములలా ఉండండి అని ఆసీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది.జనక మహారాజు గారు దశరథ మహారాజు గారిని అడుగుతారు మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా అని.దశరథ మహారాజు గారు అన్నారు "అయ్యా! ఇచ్చే వాడు ఉంటే కదూ పుచ్చుకునే వాడు ఉండేది."

అది.తన కొడుకు రామచంద్రమూర్తి ఎంతటి పరాక్రమవంతుడో,ఎంతటి గుణవంతుడో తెలిసినా కూడా తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు దాతతో మాట్లాడేటప్పుడు.ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు అంతటి వాడు.

నిశ్చితార్థం లో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరువురు పెళ్ళివారూ కూర్చుని సీతారామ కళ్యాణ సర్గ చదివాలి.ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏంటి అనేది వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని ఆయనకు తెలియదా?నువ్వు చెప్పక్కర్లేదు పెళ్ళి మాత్రం బాగా గ్రాండ్ గా జరిపించాలి అండి అని.ఆ దాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవాడిగా నీకు అధికారం ఉండదు దాతతో ఎలా ఏర్పాట్లు చేయాలో చెప్పడానికి. కట్నాలు,ఎదురు కట్నాలు,పెళ్ళి వాళ్ళ అరుపులు,కేకలు,అత్తవారి చివాట్లు,ఆడపడుచుల దబాయింపులు, ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.

marriage meaning, types of marriage, marriage history, best definition of marriage, hindu marriage, పెళ్ళి, ఆడపిల్ల తండ్రి.

Comments