భక్తులు మోసపోకుండా శ్రీ‌వారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు | TTD launches new portal for online booking


శ్రీ‌వారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు :
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆర్జిత‌సేవలు, ద‌ర్శ‌నం, బ‌స, క‌ల్యాణ‌మండ‌పాలు త‌దిత‌ర ఆన్‌లైన్ సేవ‌లను బుక్ చేసుకోవ‌డంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేష‌న్స్ సౌక‌ర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా మార్పు చేసినట్లు వెల్లడించింది. ఇది శనివారం (23వ తేది) నుంచి అమల్లోకి రానుంది. 


తితిదే పేరుతో కోకొల్లలుగా పుట్టుకొచ్చిన నకిలీ వెబ్సైట్ల వల్ల భక్తులు మోసపోకుండా కొత్తది రూపొందించినట్లు తితిదే వివరించింది. ఇప్పటికే భక్తులను మోసం చేసిన 20 సైట్లపై కేసులు నమోదైనట్లు తెలిపింది. కొత్తగా రూపొందించిన tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో తిరుపతి, బాలాజీ, ఏపీ.గవ్ . పదాల కూర్పుపై వివరణ ఇస్తూ..ఉత్తరాది రాష్ట్రాల వారు శ్రీవేంకటేశ్వర స్వామిని బాలాజీ పేరుతో కొలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల వారు తిరుపతి యాత్రగా పిలుస్తారు. ఈ రెండు పదాలతోనే గూగుల్ లో సెర్చి చేయడం ద్వారా నకిలీ వెబ్ సైట్ల బారిన పడుతున్నారు. కొత్త వెబ్ సైట్ లో ఈ రెండు పదాలను చేర్చినందున అధికారిక సైట్ ఓపెన్ అవుతుంది. కేవలం డొమైన్ లో తప్ప అప్లికేషన్స్ లో మార్పులు చేయలేదు. ap.gov.in అనేది రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్ పరిధిలోకి వస్తుంది. ap.gov.in పేరుతో నకిలీ వెబ్ సైట్లు తీసుకురావడం అంత సులువు కాదు అని పేర్కొంది.

మే 23వ తేదీ నుండి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌వ‌ల‌సిన‌దిగా మ‌న‌వి.


Related Posts:
విద్యార్థులకు గుడ్ న్యూస్ | AP Jagananna Vidya Kanuka Kits Scheme 2020
కరోనా తెచ్చిన మార్పులు గమనించారా | corona changes in indian culture
ఆధ్యాత్మిక పుస్తకాలూ అన్ని ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేస్కోండి
ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి | YSR Kapu Nestam Scheme
tirumala samacharam, tirumala latest news, tirumala rush today, helpdesk@tirumala, tirumala history, 300 rs current booking in tirumala, hotel in tirumala, tirumala temple closed, ttd news,tirumala web sites, tirumala latest wes site, https:/ttdsevaonline.com , https:/tirupatibalaji.ap.gov.in

Comments