పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయబోతున్నారో వారి పేర్లను అధికార పార్టీ తెలుగుదేశం , ప్రధాన ప్రతిపక్షం వైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ రెండు పార్టీలు అభ్యర్థుల విషయం లో ప్రయోగాల జోలికి పోకుండా ముందునుంచి అనుకుంటున్న వారికే అవకాశం కల్పించాయి. తెలుగు దేశం అభ్యర్థి విషయం లో కాస్త అటు ఇటు అవుతుందని అందరు అనుకున్నారు .. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడకు అవకాశం అవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. ముద్రగడతో జరిపిన చర్చర్లు ఫలప్రదం కాలేదని వార్తలొచ్చాయి . కానీ తెలుగు దేశం మాత్రం వర్మ వైపుకే మొగ్గుచూపించింది. వైస్సార్ కాంగ్రేస్ మాత్రం పెండెం దొరబాబుకే అవకాశం ఇచ్చింది. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేయబోతున్నారు అన్నప్రచారం నిన్నటి తో తెరబడింది. పవన్ పిఠాపురం నుంచి పోటీచేయడం లేదు అని తెలియడంతో .. వర్మ , దొరబాబు తో ఎవరు పోటీపడబోతున్నారు వారికి దీటైన అభ్యర్థి ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది .
స్వతంత్ర అభ్యర్థి బరిలో :
ఈ సారి స్వతంత్ర అభ్యర్థి బరిలో భారతీయుడు నామినేషన్ వేయబోతున్నట్టు ప్రకటించారు. పిఠాపురం లో పార్టీ లకే కాదు అభ్యర్థులకు పట్టంగడతారని అత్యధిక మెజార్టీ తో గత ఎన్నికలలో గెలిచినా వర్మ నిరూపించారు కూడా .
సాయంత్రం లోపు జనసేన :
పిఠాపురం అభ్యర్థిగా జనసేన నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అన్నది ఈ రోజు సాయంత్రం లోపు తెలిసే అవకాశం ఉంది.
ఈ సారి పిఠాపురం నియోజక ప్రజలు ఎవరికీ పట్టంగట్టబోతున్నారో చూడాలి.
Comments
Post a Comment