జనసేన పార్టీ నుంచి పిఠాపురం నియోజక అభ్యర్థిగా శ్రీమతి మాకీనిడి శేషుకుమారి ప్రకటించిన విషయం తెల్సిందే. దానితో పిఠాపురం జనసేన పార్టీ నుంచి నిరసన ప్రదర్శనలు కూడా చేశారు స్థానికులకు టికెట్ కేటాయించాలని, వారిని పిఠాపురం నుంచి గెలిపించుకుంటామని అధిష్ఠానం దృష్టికి తీస్కుని వెళ్లారు. జనసేన నుంచి కొందరు నాయకులు పార్టీ మారబోతున్నారు అని చెప్పుకుంటున్నారు. పిఠాపురం ప్రజలకు తానూ అందుబాటులో ఉంటానని అందరిని కలుపుకుని వెళతానని ప్రతి ఒక్కరు జనసేనకు మద్దత్తు తెలియచేయాలని,పిఠాపురం నియోజక వర్గం లో రాజకీయ మార్పు మొదలుకాబోతుందని శేషుకుమారి చెబుతున్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామ శివాలయంలో దర్శనం అనంతరం జనసైనికులతో ఆమె కలిసారు. జనసేన విజయం కొరకు అందరూ కలిసిపనిచేద్దాం అని పిలుపునిచ్చారు.
Comments
Post a Comment