చైనా పై ప్రతీకారానికి సిద్ధమవుతున్న అమెరికా | Amerika vs China


చైనా వైరస్ అని ఎందుకు పిలవకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రాంప్ , చైనా పేరు వింటేనే ఎక్కడలేని కోపం తో ఊగిపోతున్న విషయం అందరికి తెల్సిందే . చైనా పైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికా సిద్ధమవుతున్నట్టు సమాచారం . చైనా లో తయారు అయినా టిక్ టాక్ యాప్ ని బ్యాన్ చేయడానికి అమెరికా ముందుకొచ్చిన విషయం తెల్సిందే . టిక్ టాక్ యాప్ లో తమ దేశ పౌరుల సమాచారం ఉండటం అవి భద్రతా పరంగా లోపభూహిష్టంగా ఉందని అమెరికా  చెప్పుకొచ్చి తాము టిక్ టాక్ అప్ ని బ్యాన్ చేస్తునట్టు ప్రకటించింది . 

మిత్ర దేశాల మధ్య సమాచారం స్పష్టంగా ఉండాలని . కానీ చైనా మాత్రం సమాచారాన్ని దాస్తూనే వచ్చిందని , చైనా లో చాల ల్యాబ్ లు ఉన్నాయని కానీ వాటిలో ఎం జరుగుతుందని చైనా చెప్పడం లేదని ఒకవేళ ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వారి గొంతు నొక్కే విధంగా చేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు . 

కరోనా విజృంభిస్తున్న సమయం లో చైనా నిర్లక్ష్యంగా వ్యవరిస్తుందని ,  ఇప్పటికి కరోనా వైరస్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తాము స్పష్టంగా చెప్పలేం అంటున్న చైనా పై అమెరికా చాల కోపంగా ఉంది . చైనా నుంచి వచ్చే దిగుమతులపై భారీగా పన్ను లను పెంచాలని ఐతే సరైన సమయం చూసి పెంచుతామని చెప్పుకొచ్చింది . కరోనా కారణంగా ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలోనే 65 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు . కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత అమెరికా తీసుకునే నిర్ణయాలు చాల కఠినంగా ఉండబోతున్నాయని సంకేతాలను ఇస్తుంది . 

Comments