కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్
ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా.. మొబైల్ ఫోన్స్ కనిపిస్తూనే ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఫోన్లకి అతుక్కుపోయారనే చెప్పాలి. దీంతో.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం టెన్త్ విద్యార్థులు చదివే సిలబస్‌ను వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా విద్యార్థులకు పంపాలని ప్లాన్స్ వేస్తోంది ప్రభుత్వం. ప్రతీ స్కూలుకూ ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయాలనుకుంటోంది. ఆ గ్రూపులో ఆ స్కూళ్లోని విద్యార్థులు, టీచర్లు ఉంటారు. టెన్త్ పరీక్షల కోసం విద్యార్థులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తోంది.
మొత్తం 24 వేల మంది విద్యార్థులు, 933 మంది టీచర్లు.. ఈ ఆన్‌లైన్ క్లాసుల్లో చేరనున్నారు. లెక్చరర్లు తమ క్లాసులను వీడియో రికార్డు చేసి.. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ యూట్యూబ్ యూఆర్‌ఎల్ లింక్స్‌ని వాట్సాప్ గ్రూపు లేదా ఈ మెయిల్‌లో విద్యార్థులకు పంపుతారు. విద్యార్ధులు ఆ లింక్ ఓపెన్ చేసి.. వీడియో చూసి.. లెసెన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వారు తయారు చేసుకునే నోట్స్‌ను వాట్సాప్ లేదా ఈ మెయిల్ ద్వారా టీచర్లకు పంపాలి. దీంతో కరోనా వైరస్ కట్టడితో పాటు విద్యార్థులకు కూడా సమయం వృథా కాకుండా ఉంటుంది. కాగా ఇంటర్మీడియ్ విద్యార్థులకు కూడా ఏపీ ప్రభుత్వం జూన్, జులైలో ఇదే విధానాన్ని ప్రారంభించబోతుంది.
Related Posts:
> నెలకు రూ. లక్షన్నర సంపాదించే...ఈజీ బిజినెస్ | Business Ideas
> ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Grama Sachivalayam Recruitment
> Chanakya Neeti Sutralu Telugu PDF Book Free Download
ap government schemes, 10th class exam date 2020 ap, 10th class exams in ap 2020 postponed, ap 10th class hall ticket 2020, open 10th exam date 2020 ap, ap 10th class exam time table 2019, ap open 10th exam fee last date 2020, ap ssc exam fee last date 2020, ap 10th class exam date
Comments
Post a Comment