నెలకు రూ. లక్షన్నర సంపాదించే...ఈజీ బిజినెస్ | Business Ideas Especially Youth

నెలకు రూ. లక్షన్నర సంపాదించే...ఈజీ బిజినెస్...యువత కోసం ప్రత్యేకం...
ఎ4 పేపర్లను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తే చక్కని లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ వనరుగా కూడా మార్చుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు కొనసాగితే పెద్ద ఎత్తున లాభాలను కూడా పొందవచ్చు. మరి ఎ4 పేపర్ల తయారీ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఖర్చవుతుందో.. ఏ మేర ఆదాయం సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం.


ఎ4 పేపర్ల తయారీకి పేపర్ రోల్ మేకింగ్ మెషిన్ అవసరం అవుతుంది. దీని ధర రూ.5 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఎ4 పేపర్లను తయారు చేసేందుకు జీఎస్ఎం ఎ4 పేపర్ రోల్స్ అవసరం అవుతాయి. ఒక్కో కేజీ రోల్ ధర రూ.60 వరకు ఉంటుంది. వీటిని ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఇంట్లో ప్రత్యేకంగా ఒక రూం ఉంటే..

ఇంట్లోనే ఈ మెషిన్‌ను పెట్టి ఎ4 పేపర్లను తయారు చేసి విక్రయించవచ్చు. మెషిన్‌లో ఎ4 పేపర్ రోల్స్‌ను పెట్టి వాటిని పేపర్లుగా కట్ చేయాలి. అనంతరం వాటిని ప్యాక్ చేసి విక్రయించాలి.

ఎ4 పేపర్ బండిల్స్ ధర పేపర్ల జీఎస్ఎం క్వాలిటీని బట్టి ఉంటుంది. సాధారణంగా ఒక్క ఎ4 పేపర్ బండిల్ తయారీకి రూ.100 వరకు ఖర్చవుతుంది. దాన్ని మార్కెట్‌లో రూ.180 నుంచి రూ.200కు విక్రయించవచ్చు. దీంతో ఒక్క బండిల్‌పై ఎంత లేదన్నా కనీసం రూ.80 మార్జిన్ వస్తుంది. ఈ క్రమంలో నిత్యం 50 బండిల్స్‌ను తయారు చేసినా 50 X 80 = రూ.4000 వస్తాయి. అదే నెలకు అయితే 30 X 4000 = రూ.1,20,000 వస్తాయి. ఇలా నెల నెలా ఆదాయం సంపాదించవచ్చు.ఇక ఈ బిజినెస్‌కు గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర వాణిజ్య సముదాయాల వారితో టై అప్ అయి ఎ4 పేపర్ బండిల్స్‌ను తరచూ సప్లయి చేయవచ్చు. దీంతో ఈ బిజినెస్‌లో చక్కని లాభాలు రావడంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఇందులో కొనసాగి.. ఆదాయం సంపాదించవచ్చు.


Related Posts :
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Grama Sachivalayam Recruitment
ఏపి కరోనా అప్‌డేట్.. ముగ్గురు మృతి | Corona Updates | Latest News
SBI గుడ్ న్యూస్ | 6 నెలలు ఈఎంఐ చెల్లించక్కర్లేదు | No EMI Six Months
Chanakya Neeti Sutralu Telugu PDF Book Free Download
saree business ideas in telugu, new business ideas 2018 telugu, food business ideas in telugu, small scale business machines telugu, vegetable business in telugu, swayam upadhi ideas in telugu, low investment high profit business in telugu, telugu business books, business ideas in telugu, business ideas, news paper business, A4 paper business.

Comments