రంగంలోకి కరోనా కేంద్ర బృందాలు | Corona Lockdown | Corona Update

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం... కేంద్ర ప్రజారోగ్య బృందాల్ని పంపింది. వీటిలో తెలంగాణలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న హైదరాబాద్‌కి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపుతోంది. అలాగే... ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాలకు ఇదరేసి చొప్పున మూడు బృందాలు వెళ్లనున్నాయి. ఇవాళ ఈ బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకొని... అక్కడి ప్రభుత్వాధికారుల్ని కలవనున్నారు. ఈ బృందాలతో కో-ఆర్డినేషన్ చేసుకుంటూ... రాష్ట్రాల్లో వైద్యాధికారులు... తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.


హైదరాబాద్‌కి వచ్చే టీంలో నెషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి చెందిన డాక్టర్ జయంత్‌దాస్, డాక్టర్ దీపయాన్ బెనర్జీ ఉంటున్నారు.

ఈ టీమ్... రాష్ట్ర వైద్య అధికారులకు తగిన సూచనలు చేస్తూ... కరోనాను బ్రేక్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పటికప్పుడు కోరనా రిపోర్టులు తెలుసుకుంటూ... నెక్ట్స్ ఏంచేస్తే బెటరో తగిన సలహాలు, సూచనలూ చేస్తుంది.

ఈ కేంద్ర బృందాలు ఎంతకాలం ఆయా రాష్ట్రాల్లో ఉంటాయో కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. కరోనా కేసులు తగ్గేవరకూ ఉండే అవకాశాలున్నాయి. మొత్తం 20 ప్రజారోగ్య బృందాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. మొత్తం 20 జిల్లాలకు ఈ టీమ్స్ వెళ్తున్నాయి. ఆ జిల్లాలు ఏవంటే...హైదరాబాద్, తెలంగాణ


కర్నూలు, ఆంధ్రప్రదేశ్
గుంటూరు, ఆంధ్రప్రదేశ్
కృష్ణ, ఆంధ్రప్రదేశ్ముంబై, మహారాష్ట్ర
పుణె, మహారాష్ట్ర
థానె, మహారాష్ట్ర
అహ్మదాబాద్, గుజరాత్
సూరత్, గుజరాత్,
వడోదర, గుజరాత్,
ఢిల్లీ (ఆగ్నేయ ఢిల్లీ)
సెంట్రల్ ఢిల్లీ
ఇండోర్, మధ్యప్రదేశ్,
భోపాల్, మధ్యప్రదేశ్
జైపూర్, రాజస్థాన్
జోధపూర్, రాజస్థాన్
చెన్నై, తమిళనాడు
ఆగ్రా, ఉత్తరప్రదేశ్,
లక్నో, ఉత్తరప్రదేశ్
కోల్‌కతా, బెంగాల్
corona lockdown, corona lockdown extension, corona lockdown extension in ap, corona lockdown extension india, corona updates, corona news latest, today cases ap.

Comments