అదిగో పులి | North Korea's Kim Jong

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెత ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది . ఉత్తర కొరియా అధినేత కిమ్ , గత కొద్దిరోజులుగా కనిపించక పోయేసరికి మీడియా లోను అటు సోషల్ మీడియా లోను బోలెడు ఊహాగానాల తో కూడిన వార్తలు చక్కర్లు కొట్టాయి . కిమ్ కు కరోనా సోకిందని ఇకలేరు అనే దాకా ఈ ప్రచారం జరిగింది . ఏకంగా చైనా వైద్య బృందం వచ్చి ఆయన ఆరోగ్య సరిగా లేదని చెప్పాయని ఒకరు చెప్తే , ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరుగుతుండగా కోమాలోకి వెళ్లారని , కోమాలో ఉండగానే బ్రెయిన్ డెడ్ అయిందని మరొక ప్రచారం జరిగింది. 

ఈ ప్రచారాలకు మరీంత బలం చేకూర్చుతూ కిమ్ చెల్లెలు జోగ్  వెలుగులోకి రావడం తో , కిమ్ తరువాత జోగ్ నే ఉత్తర కొరియా పట్టాలు చేపట్టబోతుందనే  ప్రచారం   మరీంత జోరందుకుంది . అమెరికా వాళ్ళు బయట పడలేకున్నా ఉత్తరకొరియా లో ఎం జరుగుతుందో గమనించే పనిలోనే ఉంది. ఒక వైపు ప్రపంచం అంత కరోనా వైపు  చూస్తుంటే , చాలానే దేశాలు గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర కొరియా లో జరుగుతున్న పరిణామాలు పై ఓ కన్నేసే ఉంచాయి . అందరి ఊహాగానాలకు తెరదించుతూ కిమ్ ప్రత్యక్షం అయ్యాడు .. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఎరువుల ఫ్యాక్టీరియా ఓపెనింగ్ కి కిమ్ హాజరయ్యాడు . 

ప్రారంభోత్సవ కార్యక్రమం  లో చాల హుషారుగా కనిపించాడు .  
జరిగింది ఏమిటంటే ఏప్రిల్ 11 న అధికార పార్టీ సమావేశానికి హాజరైన కిమ్ ఆ తరువాత కనిపించలేదు . ఏప్రిల్ 15 వ తేదీన అత్యంత ముఖ్యమైన కార్యక్రమైన వాలా తాతా జయంతికి కూడా కిమ్ హాజరు కాకపోవడం తో అందరికి అనుమానం వచ్చింది , గతం లో జరిగిన ఆపరేషన్ లు ఆయన ఆరోగ్యం పై సందేహాలకు మరీంత బలం చేకూర్చాయి .  2014 లో కూడా ఈ విధంగానే 40 రోజులు కనిపించకుండా అజ్ఞాతం లో కి వెళ్ళాడు .. ఇప్పుడు తిరిగిరావడం అంటుంచి ఇన్ని రోజులు ఎక్కడకు వెళ్ళాడు ఏమి ప్రణాళికలు వేసి ఉంటాడు అనే ప్రశ్నలను ప్రపంచానికి వదిలిపెట్టాడు . 
North Korea's Kim Jong'

kim jong un facts

Comments