ప్రజా వేదిక కూల్చివేశారు | Rajeev Gandhi municipal school Pithapuram | Pithapuram News


ప్రెస్ నోట్ 
ది.23/05/2020
పిఠాపురం పట్టణం లో రాజీవ్ గాంధీ మునిసిపల్  హై స్కూల్ నందు మునిసిపాలిటీ కి సంబంధించిన 5,00,000/- ఐదు లక్షలు రూపాయలు విలువగల ప్రజా వేదిక ఎన్నో కార్యక్రమాలకు వేదికగా వుండే ఈ వేదికను 20/05/2020 అర్ధరాత్రి అక్రమంగా కూల్చివేశారు దాని కోసం సంబంధిత అధికారులను అడిగినా మాకు తెలియదు అని నిర్లక్షపు సమాధానం చెపుతున్నారు. కాబట్టి దీని కోసం ఈరోజు ఈ కూల్చివేతకు నిరసనగా ప్రజా సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు కలిసి అక్కడ నిరశన తెలియచేశారు. ఈ వేదికను తిరిగి పునః నిర్మించి వేదికను తొలగించిన వారిపైన తగు చర్యలు తీసుకోవాలని తెలియచేశారు. 
ఈ కార్యక్రమం లో "మన పిఠాపురం- మన బాధ్యత" సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు సీపీఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments