సగ్గు బియ్యం:
సగ్గు బియ్యం అనగానె అదేదో ఒక పంట నుండి వచ్చిందని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాల మంది. కానీ నిజానికి ఇది కేవలము పరిశ్రమలలో తయారవుతుంది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది.
సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?
సగ్గు బియ్యం తయారికి ముడి సరుకు కర్ర పెండలము. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్ధతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాల లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి పూసల్లాగా జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం.
పిండి పదార్ధం ఎక్కువగా ఉండటం, రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి, షుగర్ పేషంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తుంది.
గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అధికరక్తపోటుని తగ్గిస్తాయి. దీనిలో లభించే క్యాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
Related Postes:
> ఈజీగా రూ .50 వేలు పొందాలంటే ఇలా చేయండి | central government bumper offer
> ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | High Court of Andhra Pradesh Jobs
> నెలకు రూ. లక్షన్నర సంపాదించే...ఈజీ బిజినెస్ | Business Ideas Especially Youth
సగ్గు బియ్యం, sago nutrition, sago tree, sago benefits, how to make sago, sago in english, sago seeds in tamil,sago in hindi, is sago good for diabetes, సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు , sago pearls making process
Comments
Post a Comment