కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించింది సర్కార్... దీంతో.. అన్ని సంస్థలు మూతపడ్డాయి.. అత్యవసర సేవల్లో విధుల్లో ఉన్నవారు.. వర్క్‌ఫ్రమ్ హోం ఉద్యోగాలు చేసేవాళ్లు.. మరికొందరు తప్ప.. ,చాలా మందికి జీతాలు వచ్చే పరిస్తితి లేకుండా పోయింది.. ఇక, కూలీల పరిస్థితి మరీ దారుణం.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాల్లో కోతపెట్టేశారు. అయితే, లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను తీసుకువచ్చింది.. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే రూ.2 లక్షల వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు.. ఇప్పుడు లోన్ తీసుకుని ఈఎంఐ ఎలా చెల్లించాలనే టెన్షన్ కూడా లేదు..
ఎందుకుంటే.. ఈ లోన్లకు 6 నెలల వరకు ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఆరు నెలలు గడిచిన తర్వాత 7.25 శాతం వడ్డీతో లోన్ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ ప్రిఅప్రూవ్డ్ రుణాలు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ లభిస్తుంది. మీరు కూడా మీ రుణ అర్హతను సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక్క ఎస్ఎంఎస్ పంపి రుణ అర్హత తెలుసుకునే అవకాశం అందుబాటులో ఉంది.
మీరు మీ రుణ అర్హతను తెలుసుకోవాలంటే పీఏపీఎల్ “PAPL <space> <last 4 digits of your bank account>”అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ చేయాలి. ఇప్పుడు మీరు లోన్‌కు అర్హులో కాదో తెలిసిపోతుంది. మీకు తిరిగి బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ లోన్‌కు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. వెంటనే లోన్ డబ్బులు అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.
లోన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రిఅప్రూవ్డ్ లోన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు లోన్ టెన్యూర్, లోన్ అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. లోన్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తాయి.
sbi emergency loan, sbi emergency loan schem, sbi emergency loan 2020
Comments
Post a Comment