సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ మీకు కావాలి అంటే ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి | Srivari Laddu prasadam in their city itself


లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు  సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం:
దర్శనం లేకపోయినా ఈ హుండీ ద్వారా భక్తుల కానుకల సమర్పణ 
టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి 

లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.  ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని తనకు అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు రూ.25 కే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.  ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది, రెండు  మూడు రోజుల్లో చెబుతామన్నారు.


అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ బుధ‌వారం  శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో మీడియాతో మాట్లాడారు. భ‌క్తుల నుండి అభ్య‌ర్థ‌న‌లు  పరిగణనలోకి తీసుకుని, లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు,చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ నగరాల్లో ఉన్న స‌మాచార కేంద్రాల్లో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఎవ‌రైనా ఎక్కువ మోతాదులో ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకుని భ‌క్తుల‌కు పంచ‌ద‌ల‌చుకుంటే వారు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  శ్రీ హరీంద్ర నాథ్ 9849575952 లేదా ఆల‌య పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్ 9701092777ను సంప్ర‌దించాల‌ని కోరారు.


Related Posts:
ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి 
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే | AP State Trains information
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RINL Vizag Steel Plant Recruitment
ఈజీగా రూ .50 వేలు పొందాలంటే ఇలా చేయండి | central government
srivari laddu seva, tirupati prasadam laddu price, srivari seva voluntary service online application 2019, ttd online, srivari seva dress code, srivari seva application form download, srivari seva contact number, ttd voluntary seva application form

Comments