నేడు ఐపీఎల్ 13వ సీజన్
షెడ్యూల్ విడుదల చేశారు :
ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఖరారైనా ఐపీఎల్ 2020 వేడుక ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ఆదివారం విడుదలైంది. యూఏఈ వేదికగా జరగనున్న డ్రీమ్ 11 ఐపీఎల్‌లో.. సెప్టెంబర్ 19న అబుదాబిలో ముంబై వర్సెస్ చెన్నై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 20న దుబాయ్‌లో ఢిల్లీ వర్సెస్ పంజాబ్, 21న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు, 22న రాజస్థాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్‌కతా వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆలస్యంగానైనా సరే ప్రాక్టీస్ మొదలు పెట్టేయడంతో అనుకున్న ప్రకారమే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో తలపడే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు.
source : సాక్షి
Comments
Post a Comment