పండగవేళ ప్రత్యేక రైళ్లు | Festival Special Trains

 

Festival Special Trains

పండగవేళ ప్రత్యేక రైళ్లు....

 కరోనా కారణంగా దాదాపు 6 నెలలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. ఐతే కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రైల్వేశాఖ మళ్ళీ పట్టాలెక్కింది. ఇందులో భాగంగానే దసరా పండుగను పరిగణలోకి తీసుకొని కొన్ని ప్రత్యేక రైళ్లు నడవబోతున్నాయి.

అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 30 వరకు నిత్యం నడిచే రైళ్లు..

లింగంపల్లి–కాకినాడ పోర్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌:లింగంపల్లి స్టేషన్‌లో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి ఉదయం 7.20కి కాకినాడ చేరుకుంటుంది. నగరం వైపు వచ్చే రైలు కాకినాడలో రాత్రి 7.10కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి.

లింగంపల్లి–తిరుపతి..

తిరుపతి–అమరావతి (మహారాష్ట్ర)

లింగంపల్లిలో సాయంత్రం 5.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నగరానికి వచ్చే రైలు తిరుపతిలో సాయంత్రం 6.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55కు లింగంపల్లి చేరుకుంటుంది. ఇవి బేగంపేట, సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, నడికుడి, గుంటూరు, ఒంగోలు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.

Keywords

Trains,festival trains, tirupati to lingampalli, lingampalli to tirupathi, kakinada trains,kakinada special trains


Comments