థియేటర్లు ఓపెన్ చేసే సమస్యే లేదు | Theaters Not Opened

Theaters not opened

 థియేటర్లు ఓపెన్ చేసే సమస్యే లేదు...

 అక్టోబర్ 15న థియేటర్లు తెరవనున్నాయని అందరికి తెలిసిన వార్తే. ఐతే థియేటర్ల యాజమాన్యం మాత్రం దానికి అంగీకరించలేదు. గత ఏడు నెలలుగా సినిమా రిలీజ్‌లు లేక నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్‌ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని థియేటర్ల యాజమాన్యం కోరింది. బుధవారం ఫిలింఛాంబర్లో జరిగిన సమావేశంలో ఆంధ్ర ఫిలిం ఎక్సిబిటర్ల అధ్యక్షుడు కే.ఎస్‌. ప్రసాద్ మాట్లాడుతూ.."సీఎం జగన్ గారు విద్యుత్ బకాయలు రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఇంకా రద్దు కాలేదు.అనేక సమస్యల కారణంగా ఈ నెల 15 న నుంచి థియేటర్లు చేయటం లేదు.మంత్రి పేర్ని నాని గారితో మా సమస్యలు చర్చిస్తున్నామని ,మా సమస్యలు తీరేవరకు థియేటర్లు ఓపెన్ చేసే ప్రసక్తే లేదని కే ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.

‘లాక్‌డౌన్‌ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలి. మా సమస్యలను చిరంజీవి నాగార్జున గారి సహకారంతో ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాం’ అని ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సెక్రటరీ గోరంట్ల బాబు అన్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ సెక్రటరీ రమేష్  మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లకి కరెంట్ మినిమమ్ చార్జీలు వేశారు. ఒక్కో థియేటర్‌కు ఈ 7 నెలల కాలం లో 4 లక్షల రూపాయలు అవుతుంది.ఇపుడు ఉన్న పరిస్థితిలో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుంది
ఆక్యుపెన్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మా సమస్య పరిష్కస్తుందని ఆశిస్తున్నా’అని అన్నారు.

Keywords

Theaters,cinima halls,film chamber,current bill

Comments