భార్య భర్తల మధ్య క్లోజనెస్ తగ్గిందా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి | How to Improve Your Relationship With Your Spouse

 ఆర్థిక, మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా అయితే ఇలా చేయండి. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాంటి శక్తులను పారద్రోలి. ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే వుంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది.

ఓ గాజు బౌల్‌ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును బౌల్ లో వేయాలి. ఆ బౌల్‌ను స్నానపు గదిలో పైభాగాన వుంచాలి. ఈ బౌల్‌పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు వుండవు. దారిద్ర్యం తొలగిపోతుంది.

అంతేగాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, ఒక టి స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో వుండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి వుంటుంది. ధనాన్ని పెట్టె పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడతపెట్టి వుంచితే ఆర్థిక ఇబ్బందులు వుండవు.

దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలోని పై అలమరాల్లో రాళ్ల ఉప్పును నింపిన బౌల్‌ను పెట్టి  వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుండి తప్పించుకోవచ్చును . ఇంకా వాహనాల కోసం చేసే అనవసరపు ఖర్చు తగ్గుతుంది. ఇంకా ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. అంతేగాకుండా వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వుండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.

తెల్లఆవాలతో ధూపమేస్తే ఫలితం :

తెల్ల ఆవాలతో యాగం చేయడం ద్వారా దుష్ట శక్తులు ఇంటి నుండి తొలగిపోతాయి. అంతేగాకుండా ఇంట్లో ధూపాన్ని వేసే సాంబ్రాణిలో తెల్ల ఆవాలు వేస్తే ఇంట్లో ప్రతికూల ఫలితాలు సైతం తొలగిపోతాయి.

తెల్ల ఆవాలు, గోరింటాకు గింజలు, సాంబ్రాణి, బిల్వ పత్రాల పొడి, వేపాకు పొడి, గరిక పొడిని కలిపి మంగళవారం, గురువారం, ఆదివారం పూట సాయంత్రం ఆరు తర్వాత సాంబ్రాణితో కలిపి ధూపమెస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది.

దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఈ వస్తువులు కాళ్ళకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఈ వస్తువులకు దైవాత్మిక శక్తి వుంటుంది. వేపాకు శక్తి మాతకు, గరిక వినాయకునికి ప్రీతికరం. ఇలాంటివి అగ్నిలో వేయడం ద్వారా దుష్ట శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో రోజు రెండు పూటల దేవునికి దీపారాధన చేసే ఇంట్లో తిండికి లోటు ఉండదు. ప్రతి రోజు శక్తి కొలది పేదవారికి, పశు పక్షాదులకు ఆహరం అందిస్తే కుటుంబ సభ్యలు సుఖ శాంతులతో ఉంటారు.

Famous Posts:

భార్య,  భర్త, husband and wife relationship in bed story, wife and husband, relation, wife and husband relations tips telugu, marriage, husband wife relationship rules.

Comments