అన్నం పెట్టడం...
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్న్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి, నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం ఇచ్చినా యెంతో పుణ్యదాయకం.
ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో..!! యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలిగిపోతుంది. మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు.
నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో..!!
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి. కావున , “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్క కు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది.
Famous Posts:
Tags :అన్నం పెట్టడం, Significance of Annadanam, Importance of Annadanam, Annadanam, annadanam benefits, annadanam in telugu, annadanam donation,
Comments
Post a Comment