శకునాలు-నమ్మకాలు - ప్రయాణానికి శుభ శకునాలు - అశుభ శకునాలు | Importance of Sakunalu

    

మంచి శకునం ఎదురు రావడం వలన, తలపెట్టినకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందని పురాతన కాలం నుండి వస్తున్న విశ్వాసం ఇప్పటికీ కొనసాగుతుంది. 

ఎవరు ఏ శుభకార్యం నిమిత్తం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి వుంది. సాధారణంగా ముత్తయిదువులు ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. అలాగే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వేస్తారు.

శుభ శకునాలు:

ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల వినిపించినా .. గంట ధ్వని వినిపించినా శుభప్రదమేనని శాస్త్రం చెబుతోంది. గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుండగా ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లా పాపాలతో కూడిన దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరవచ్చని అంటారు. ఇక అనుకోకుండా ఏనుగు .. గుర్రం .. ఆవులు ఎదురైనా, తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని చెబుతారు. ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా .. చెడు వార్త విన్నా, కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోవాలి. మంచినీళ్లు తాగేసి .. ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు.

అశుభ శకునాలు:

ఏడుపు వినుట, అకాల వర్షము, ముక్కు చీదుట, బల్లిపడుట, వితంతువులు, జుట్టు విరబోసుకున్నవారు, జుట్టులేనివారు, ఒకే తుమ్ము, ఊక, కలహము, చెడుమాట, ముగ్గురు వైశ్యులు, జంటశూద్రులు, కషాయబట్టలు కట్టినవారు, పాము, కొత్తకుండ, నూనె, కట్టెలమోపు, ముష్టివాడు, కుంటికుక్క, ముక్కులేనివాడు, గుడ్డివాడు, రోగి, కుంటివాడు, రజస్వల, గర్భిణీస్ర్తీ, ఉప్పు, బొగ్గులు, రాళ్ళు, ఆమేధ్యం, నువ్వులు, మినుములు, గొఱ్ఱెలు, నపుంసకులు, పిల్లి, పంది, దూది, మజ్జిగ, బూడిద, కురూపి, చెడు జంతువులు, ఆయుధమును ధరించినవాడు, విరోధి,వెళ్ళవద్దని కోరుట, భోజనము చేయమని అడుగుట, సిద్ధవస్తువులు, జారుట, దెబ్బతగులుట, తొట్రుపడుట, మనసు కీడు శంకించుట, ఆరోగ్యము లేకుండుట, గుడ్లగూబ అరచుట వంటి పరిణామాలు ఎదురుపడినా ఇవన్నీ అశుభాలే.

అశుభ శకునాలు ఎదురైన వెంటనే ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని 12 పర్యాయాలు నీళ్ళు పుకిలించి ఊయవలెను. తలపై నీరు చల్లుకొని. కళ్ళు నీళ్ళతో తుడుచుకొని కూర్చుని కాసిన్ని నీళ్లు తాగి ఇష్ట దైవంను ప్రార్థించి తర్వాత మరొక శుభ శకునమును చూసుకొని ప్రయాణం చేయవలెను. ప్రయాణాలకు బయలుదేరునప్పుడు 'ఎక్కడికి?' అని గానీ, 'ఎప్పుడు వస్తావు?' అని గానీ, 'నేనూ రానా?' అని గానీ ఎవరూ అడుగరాదు. ప్రయాణమై వెళ్ళిన వెంటనే ఇల్లు కడుగుట, ఇల్లాలు తలస్నానం చేయుట దరిద్రానికి కారణాలు అవుతాయని పెద్దలు అంటారు.అందుకే ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తతో ఉండటమే మంచిది అని మన పెద్దల సూచనలు వినిపిస్తుంటాయి.

Famous Posts:

Tags : శకునాలు , Sakunalu, good sakunalu, bad sakunalu, అశుభ శకునాలు, 

Comments