ఆలయాలలో ఎంత టెక్నాలజీ దాగివుందో మీకు తెలుసా ? దాని వెనుక ఉన్న రహస్యాలేంటి - Indias ancient advanced architectural wonders

సనాతన హిందూ సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి.. అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Also Read : వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి ? ముడుపు కట్టడం ఎలా..!

తరంగాలు కలిసేచోట  

మన భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే దేవాలయంలోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి...

దేవాలయ దర్శనం

 మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే చాలా మంది అందరూ ఎడమవైపు నుండి (Clockwise Direction) ప్రదక్షిణలు చేస్తారు. ఎవ్వరూ అందుకు యాంటీక్లాక్ వైపు నుండి చేయరు. అలా ఎందుకు తిరుగుతారంటే.. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలా మంది నమ్మకం. ఇవి మన బాడీలోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి...

మంత్రాలు

ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలా మందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే.. అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి...

బంగారానికి తరంగాలకు సంబంధం

 మనం దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన పెద్దలు మంచి ఆభరణాలు వేసుకోమని చెబుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయట...

గర్భగుడి

మన హిందూ దేవాలయాల్లో చాలా వాటికి గర్భగుడులు ఉంటాయి. ఈ గర్భగుడి ఎప్పుడూ ఒక వైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు...

తడిబట్టలు 

మనలో చాలా మంది దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సీజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి...

Also Read : సృష్టి రహస్య విశేషాలు - సృష్టి  ఎలా  ఏర్పడ్డది

హారతి

ప్రతి దేవాలయంలో భక్తులకు హారతి ఇస్తుంటారు. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనిని ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని అంటారు. అయితే ఎక్కడో దూరంలో ఉండే హారతిని కళ్లకు అద్దుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అభిషేకం.

ఇక మన దేవాలయాల్లో దేవుళ్లకు అభిషేకరం చేసిన తర్వాత తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, మరియు పంచామ్రుతంతో పాటు అభిషేకం చేసిన వాటిని తీర్థంగా ఇస్తుంటారు. ఇంత ఆధునిక సాంతికేతికత ఉన్న మన దేవాలయాలు మానసిక, శారీరక సుఖాన్ని అందిస్తాయి...

Famous Posts:

temples in technology, scientific monuments in india, temple tech center, temple illustrator, Technology at Temple, famous temles

Comments