సముద్రంలో మునిగి ఉన్న శివాలయం రోజులో కొన్ని గంటలే దర్శనం | Miraculous The Lord Shiva Temple in the Sea - Takhteshwar Temple Bhavnagar, Gujarat

సముద్రంలో మునిగి ఉన్న శివాలయం రోజులో కొన్ని గంటలు వెనక్కి వెళ్తుంది..

ఈ గొప్ప అద్భుత శివలింగము గుజరాత్ లోని భావనగరం కు 1కిలోమీటరు ఉంటుంది. గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు. కొలియాక్ కు తూర్పున సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో నిష్కలంక్ మహదేవ్ ఆలయం ఉంది.

సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ నిష్కలంక మహదేవ్ ఆలయం వీటన్నింటికీ ఎంతో భిన్నం. భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు.

దైవదర్శనం.. 

ఉదయం పది గంటలకే భక్తులు సముద్ర తీరానికి వస్తారు. రానురాను అలల ఉదృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఓ స్తూపము, ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు వెళ్లి ఆ లింగాలకు పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, మహా శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. మరణించిన తమ పెద్దల అస్తికలను అక్కడ సముద్రంలో కలిపితే వారి అత్మ శాంతిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకోసం జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమౌతాయా అని ఎదురుచూస్తుంటారు.

ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.

ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.

స్థల పురాణం:

మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు. ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడు. ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు.

కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు. ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయి. అప్పుడు అయిదురుగు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడు. దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కధనం. పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ / నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందింది.

భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున 'భైదర్వి' అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు.

ఇక్కడ ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి. భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు. మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటి వరకూ తుఫాన్ల వలన కానీ, అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు. ఇటువంటి అధ్బుతం ప్రపంచం లో ఎక్కడా లేదు .

ఎలా వెళ్లాలి:

దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు. మార్చి నుంచి జూలై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం.

సికింద్రాబాద్ నుండి వెళ్లే భావనగర్ ఎక్స్‌ప్రెస్ లో భావనగర్ చేరి అక్కడి నుండి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా కొలియాక్ వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది.

విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది.

అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావనగర్ కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. భావనగర్ ఎక్స్ ప్రెస్, మహువ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో నడుస్తాయి. సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. భావనగర్ నుంచి కొలియాక్ గ్రామానికి 22 కిలోమీటర్ల దూరం. రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ, ఆటో రిక్షా లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు.

Famous Posts:

Tags : bhavnagar temple timings, gujarat shiva temple inside sea wikipedia, bhavnagar temple khodiyar, nishkalank mahadev temple timings, nishkalank mahadev darshan time table, nishkalank mahadev wikipedia, bhavnagar gujarat, nishkalank mahadev bhavnagar time table, gujarath, siva temples, Takhteshwar Temple Bhavnagar, Gujarat

Comments