ఫాల్గుణ మాసం విశిష్టత ఏమిటి? ఫాల్గుణ మాసంలో విష్ణువును ఏవిధంగా ఆరాధించాలి ? Phalguna masam importance in telugu

మార్చి 13 నుంచి ఏప్రిల్ 12వరకు ఫాల్గుణ మాసం. ఈ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమని భాగవతం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పాఢ్యమి నుంచి 12 రోజుల పాటు పయోవ్రతం ఆచరించి శ్రీమహా విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. పురాణాల్లో దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో ఈ పయో వ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

Also Readతిరుమల గురించి ఎవరికీ తెలియని 10 బ్రహ్మ రహస్యాలు..

విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం. సర్వదేవతావ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా ఇది కనిపిస్తుంది.

వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.

హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పరిగణిస్తారు. గోవింద వ్రతాలను విరివిగా చేస్తుంటారు. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమినాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు.

సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీ, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ ఇది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.

దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. ఈ నెలలో విష్ణుపూజకు ప్రాధాన్యత ఉంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హోలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు.

ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

Also Readఅప్పులకు, ఆర్ధిక ఇబ్బందులకు తొలగిపోవాలంటే ప్రతి రోజు ఇలా చేయండి.

ఫాల్గుణ మాసంలో శుద్ధ తదియ, చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారంలో వెలిసిన దుండీ గణపతికి సంబంధించిన పూజ ఇది. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నాడు పయో వ్రతాన్ని చేసి వామనుడిని పూజిస్తారు. ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజును ఫాల్గొణోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఫాల్గుణ ఏకాదశి రోజు ఉసిరి చెట్టును పూజించడం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తారు. దీనివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ ఏకాదశిని అమృత ఏకాదశిగా పరిగణిస్తారు. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది ఫాల్గుణ పౌర్ణమి. దీన్ని హోళీ పౌర్ణమి, మదన పౌర్ణమి, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర, దక్షిణ భారతాల్లో దీన్ని చాలా విశేషంగా జరుపుకొంటారు. దీన్ని వసంతోత్సవంలో భాగంగా పరిగణిస్తారు.

హోళీ పౌర్ణమి రోజున శివుడితో పాటు మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ మాసంలో హోళీ పండగ, దుండీ వినాయకుడి పూజ, వామన, లక్ష్మీనరసింహస్వామి పూజ, లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Famous Posts:


ఫాల్గుణ మాసం, Phalguna masam, Phalguna masam importance in telugu, today tithi telugu,  telugu panchangam calendar, phalguna masam in telugu,  phalguna masam importance.

Comments