శివుడికి బిల్వపత్ర ఆకులు సమర్పించేందుకు గల కారణాలేంటో తెలుసా? Significance of Bel Patra (Bilwa Leaf) in Hindu Pujas Lord Shiva
మహాశివరాత్రి పర్వదినం వస్తున్న సందర్భంగా బిల్వపత్రం దాని అత్యంత శుభఫలితాలు...
శివపురాణ సంగ్రహ - బిల్వపత్ర నియమాలు, ఫలితాలు...
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం౹
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం౹౹
1) త్రిదళంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు.
2) బిల్వపత్రములను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు.
3) బిల్వదళమును శుద్ధ జలంతో కడుగుతూ పదిరోజులు వాడుకోవచ్చు, కానీ సోమవారం, ప్రత్యేకరోజుల్లో మాత్రం ముందురోజు చెట్టునుండి సేకరించిన వాటితో అర్చనచెయ్యాలి.
4) మారేడు దళానికి ముందుబాగంలో అమృతం, వెనుకబాగంలో యక్షులు వుంటారు. కనుకనే బిల్వపత్రం ముందుబాగం శివలింగంపై వుండేలా సమర్పించాలి.
5) మహాలక్ష్మీ నిలయాయ అని కూడా పేర్కొనబడినబడటం వల్ల, బిల్వపత్రం సమర్పించేటపుడు గంధం రాసి సమర్పించిన శీఘ్ర అనుగ్రహం లభిస్తుంది. ఇలా వ్రాసే విధానాన్ని బట్టి ఫలితాలు కూడా వుంటాయి.
👉చూపుడు+బ్రొటనవేలుతో వ్రాసిన మోక్షం,
👉మధ్యవేలు+బ్రొటనవేలుతో రాసిన కోరిక,
👉ఉంగరంవేలు+బ్రొటనవేలితో రాసిన
ధనం ప్రాప్తిస్తుందని,
చిటికెనవేలు+బ్రొటనవేలుతో రాసిన ధర్మమార్గంలో కోరికలు నెరవేరుతాయని రుద్రశాశనంలో పేర్కొనబడినది.
6) బిల్వపత్రం కోయునపుడు ప్రార్ధించవలసిన స్తోత్రం.
నమోస్తు బిల్వతరయే శ్రీ ఫలోదయ హేతవే౹
చతుర్వర్గప్రదాత్రేచ నమోమూర్తి త్రయాత్మనే౹౹
సంసార విషవైద్యస్య సాంబస్య పరమేశితుః౹
అర్చాయైత్వాం పరిష్యామి త్వత్పత్రం సహ్యతామిదమ్౹౹
బావం
లక్ష్మీదేవి ప్రీతి పాత్రమైన, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపీ, శివునకు సమర్పించడం కోసమే కోయుచున్నాను అని ప్రార్ధించండం.
7) బిల్వపత్రాలలో 4రకాలు లభిస్తాయి.
అ) అఖండ బిల్వం- గల్లాపెట్లో వుంచిన వ్యాపారాభివృద్ధి, ఇంట్లో పూజించిన వాస్తుదోషాలు తొలగును.
ఆ) త్రిదళం+ఉమ్మెత్తపువ్వు =చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయి.
ఇ) 6-21పత్రాలు కలిగిన బిల్వపత్రం - పనుల్లో అఖండ విజయం.
ఈ) శ్వేతబిల్వం- ఆరోగ్యం సిద్ధిస్తాయి.
అయితే వీటన్నింటిలోకి త్రిమూర్తి స్వరూప బిల్వపత్రమే శివునికి అత్యంత ప్రీతిదాయకం.
బిల్వపత్రం, sivaratri, lord shiva, bhilvapatram, Bilva Patra, importance of 4 leaves in bel patra, bel patra leaves benefits, benefits of offering bilva leaves to lord shiva
when to pluck bilva leaves, bilva patra in telugu, bilva patra leaves, bel patra leaves benefits for hair, bilva patra on shiva lingam
Comments
Post a Comment