అందరూ తప్పకుండా తెలుసుకోవలసిన తెలియని కొన్ని అద్భుత విషయాలు | Things Everyone Needs To Know In Life

అందరూ తప్పకుండా తెలుసుకోవలసిన తెలియని కొన్ని అద్భుత విషయాలు మీకు తెలుసా..?

 1 . స్నానము చేయకుండా దేవతామూర్తిని తాకకూడదు.

2 .  ఆశుచి గానుండి యూ తాకరాదు( మల మూత్ర విసర్జన వంటివి చేసినపుడు అశుచి ఏర్పడుతుంది, స్నానం చేసిన తరువాత శుచి అవుతాము )

3 .  భోజనం చేసి  పాదోదకమును పుచ్చుకొనరాదు.

4 .  నైవేద్యం లేకుండా పూజించరాదు.

5.  గంటను నేలమీద ఉంచరాదు.

6.  దేవుడు ఉన్న స్థానము కంటే ఎత్తయిన ఆసనమును మీద కూర్చుని పూజ చేయరాదు.

7.  దేవుని ఎదుట భోజనం చేయరాదు.

8.  పూజ చేయునపుడు కంబలం కప్పు కొనరాదు.

9. దేవుని దగ్గర ఉమ్మ వేయకూడదు.

10.నైవేద్యమును దైవ గురు ప్రసాదము అని భావించవలెను గాని కొబ్బరి, పెసర పప్పు, కేసరి, చెక్కర పొంగలి, గారేలు అని వర్ణిస్తూ రుచి గురించి మాట్లాడరాదు, అందులో ఉప్పు తగ్గిందని కలుపుకొన రాదు.

11. దేవుని విగ్రహమును దేవుడని భావించే వలనే గాని రాయి పటము అని భావించరాదు.

12. భగవంతుని భజించు భక్తులను సామాన్య మానవులగా చూడరాదు.

13. ఇతరుల కొరకు చేసిన పదార్థములు దేవుడికి నివేదించరాదు.

14. ప్రసాదంలో తీసుకునే సమయంలో ఒంటిచేతితో తీసుకొనరాదు, నేలపై పడి వేయరాదు.

15. పూజ చేసినప్పుడు ఇతరులతో మాట్లాడరాదు, తల గోక్కోరాదు.

16. పూజ చేస్తున్న వారిని, భోజనం చేస్తున్న వారిని తిట్టరాదు, కొట్టరాదు.

17.భగవంతునికి నివేదించిన నైవేద్యం బహిష్టు స్త్రీలకు ఇవ్వరాదు. అయిదవ రోజు స్నానం తరువాత మాత్రమే ఇవ్వవచ్చు ... మొదటి నాలుగు రోజులు ప్రసాదం ఇవ్వరాదు, పూజలు చేయరాదు, నామ సంకీర్తనలు చేసుకోవచ్చు.

18. బహిష్టు స్త్రీలను తాకినచో స్నానం చేసిన తరువాత మాత్రమే పూజలు చేయవచ్చు.

19.ఉతికిన, శుభ్రమైన వస్త్రాలు ధరించి మాత్రమే పూజలు చేయాలి.

20. పురుషులు ధోవతి కట్టుకుని, భుజం పైన ఉత్రరీయం వేసుకుని పూజ చేయాలి. తువ్వాలు చుట్టుకుని గానీ, ఉత్రరీయం లేకుండా గానీ, పాంటు షర్ట్ వేసుకుని గానీ, పంచను ధోవతిలా కట్టుకోకుండా కేవలం లుంగీలా చుట్టుకుని పూజలు చేయరాదు.

21. స్త్రీలు చీర  ధరించి పసుపు కుంకుమ పెట్టుకుని పూజలు చేయాలి.

22. భగవంతునికి నివేదన చేసే పదార్థాలు స్వయంగా చేసి నివేదిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. బయట కొన్నవి నివేదించక పోవడం మంచిది.

Famous Posts:

Tags : ఆధ్యాత్మికం, Telugu Devotional Stories, devotional stories in telugu, devotional stories for kids, hindu devotional stories, devotional stories in english, devotional stories in hindi, devotional stories about faith, short devotional stories with morals, short devotional stories for youth

Comments