జీవితం లో ఒక్కసారైనా కాశి వెళ్లాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు . కాశి వెళ్ళినవారు కాశి లో 3 రోజులు , 9 రోజులు 11 రోజులు ఉండేవిధంగా ప్లాన్ చేస్కుని వెళ్తారు . కాశి లో తెలుగు వారి సత్రాలు ఎక్కువుగానే కనిపిస్తాయి . కాశి లో ప్రధానం గా ఆంధ్ర ఆశ్రమం మరియు సైకిల్ స్వామి ఆశ్రమం బాగా పేరు . ఆంధ్ర ఆశ్రమం లో రూమ్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవడానికి ఉండదు అక్కడికి వెళ్లినవారికి రూమ్స్ ఇస్తారు . రూమ్స్ ఖాళీ లేకపోతే హాల్ అయినా ఇస్తారు . రెంట్ చాల తక్కువగానే ఉంటుంది . మేము వెళ్ళినపుడు రూమ్ కి 300 ఛార్జ్ చేసారు . రూమ్ లో 5 గురు ఉండవచ్చు.
వారణాసి రైల్వే స్టేషన్ నుంచి సుమారు 10 కిమీ దూరం ఉంటుంది . అక్కడ ఆటో వారికి ఆంధ్ర ఆశ్రమం తెలుసు . మీరు పైన ఫోటో చూసారు కదా ఆంధ్ర ఆశ్రమం ఆ విధంగానే ఉంటుంది . ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే ఆంధ్ర ఆశ్రమం పేరుతో చాలానే ఉన్నాయి అవి ఆశ్రమాలు కాదు లాడ్జి లు తెలుగు వారిని మోసం చేయడానికి ఆ ఆంధ్ర ఆశ్రమం అని బోర్డు లు పెట్టారు . ఆంధ్ర ఆశ్రమం దగ్గరకి మీరు వచ్చేస్తే మీ యాత్ర చాల బాగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుగు వారుంటారు ఇక్కడ నుంచి ఆలయం కూడా దగ్గరే గంగ హారతి కూడా బాగా దగ్గర .. గంగా స్నానం చేయడానికి ఎక్కువ దూరం వెళ్లనవసరం లేదు .. ఘాట్ లు అన్ని దగ్గరగా ఉండటం వల్ల నడక తక్కువైతుంది . . కాశి యాత్ర అనగానే పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి అలాంటివారు ఇబ్బంది పడకుండా ఉంటారు.
మనకి ఏమి తెలియకపోయిన ఆశ్రమం లో చెబుతారు . లోకల్ లో చూడాల్సిన ఆలయాలు కానీ లేదా త్రివేణి సంగమం , గయా , నైమిశర్యాణం అక్కడ లోకల్ ట్రావెల్స్ వారిని ఆశ్రమం వాళ్లే పెడతారు .. లేదా మీరు బయట ట్రావెల్ వారితో మాట్లాడైన వెళ్ళాలి.
ఆశ్రమం లో భోజనాలు ఉంటాయి . మీరు ముందుగా వారికి చెప్పండి భోజనానికి వచ్చేది లేనిది . ఆంధ్ర ఆశ్రమం లో రూమ్స్ దొరకకపోతే పక్కనే సైకిల్ స్వామి ఆశ్రమం ఉంటుంది . ఇక్కడ రూమ్ రెంట్ ఆంధ్ర ఆశ్రమం తో పోలిస్తే కాస్త ఎక్కువుగానే ఉంటాయి . ఈ రెండు ఆశ్రమాలు ఒకదానికి ఒకటి దగ్గర్లోనే ఉంటాయి .
హైద్రాబాద్ నుంచి ప్రతి రోజు కాశి కి ట్రైన్ ఉంది . అలానే విజయవాడ నుంచి కూడా రెండు రోజులకొకసారి ట్రైన్ ఉంటుంది . మీరు త్రివేణి సంగమం చూసుకుని కాశి వచ్చిన పర్వాలేదు . త్రివేణి సంగమం దగ్గర పిండప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి . కాశి వచ్చిన వారు అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర , కాశి లోను అలానే గయా లోను పిండప్రదానాలు చేస్తారు . మనం కనీసం మూడు తరాలు పేర్లు రాసుకుని వెళ్ళాలి . పిండప్రదానానికి కావాల్సిన సామాగ్రి పంతుళ్లు ఇస్తారు.
మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి లేదా హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ 8247325819 వాట్సప్ చేయండి . . Varanasi Andhra Ashramam Phone Number : 0542 243 0418
Comments
Post a Comment