సుబ్రహ్మణ్యస్వామి ని సర్ప రూపం లో ఎందుకు ఆరాధిస్తారు..? Why is Subramanya Swamy worship in the form of a serpent?

సుబ్రహ్మణ్యస్వామి ని సర్ప రూపం లో ఎందుకు ఆరాధిస్తారు..?

కుమారస్వామి తన అన్నగారు అయిన వినాయకునికి గణాదిపత్యం ఇచ్చుటవలన అలిగి క్రౌ౦చపర్వతము అనగా శ్రీశైలము చేరారు. కుమారస్వామిని భూలోకం నుంచి తీసుకు వెళ్ళుటకు శివ పార్వతులు వృద్దుల రూపమున మొదట వచ్చారు. గావున మొదట వృద్ద మల్లికార్జునుడు తరువాత యవ్వనులు (పడుచువారు గా) లోపల  భ్రమరాంబ -

మల్లికార్జునులు గా  వెలిశారు. ఈ విధముగా  శ్రీశైలము లో జోతిర్లిoగము ఏర్పడినది.

Also Readఆడపిల్లలకు ముక్కు పుడక ఎందుకు కుట్టిస్తారో తెలుసా ?

శివ పార్వతులు అక్కడ కుమారస్వామి తో కలిసి కాపురము పెట్టారు. అక్కడ  చుట్టూ ఉన్న అడవి లో చెంచులు ఎక్కువగా నివసిస్తారు. వారు నాగ దేవతలను కులదేవత గా పూజిస్తారు.  వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషు ని అనుగ్రహం తో వల్లి అనే ఆమెను పెంచుకున్నారు.ఈమె ఆదిశేషుని (కొడుకు కూతురు కూతురు) మనుమరాలు. భూలోకమునకు పాము రూపము వదిలి మామూలు మానవ స్త్రీ గా వచ్చినది. కుమారస్వామి  ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు  ఆమెను చూచి ప్రేమలో పడ్డారు.మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యమని ఆమె తండ్రి ని కోరారు.

అపుడు వారు అయ్యా.. మా అమ్మాయి నాగ స్వరూపిణి. ఆమె రాత్రి పూట పామై  తిరుగును. ఆమె పాముని తప్ప ఇంకెవరినీ వివాహము చేసుకోను అని శపధము చేసినది అని చెప్పిరి . అదేమంత కష్టం కాదు నాకు అని కుమార స్వామి సర్పరూపము ధరించి ఆమె ను వివాహము చేసుకున్నారు. ఈ సర్పరూపము ధరించినది మార్గశిర శుక్ల షష్టి రోజు. పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండలినీ శక్తి కి ప్రతీక.

గనుక ఈ రోజు నుంచి నీవు బ్రహ్మణ్య దేవుడువి అనగా సు(మంచి) బ్రహ్మణ్య దేవుడువి అనగా సుబ్రహ్మణ్యడి వి అని  వల్లీ దేవి యొక్క అసలు తండ్రి కుమదుడు కుమారస్వామిని దీవించెను.ఈ విధముగా పెళ్లి కొరకు కుమారస్వామి తన జాతి నే మార్చుకొని సర్పముగా మారి సుబ్రహ్మణ్యడు  అయ్యెను.

subramanya swamy stotram, kumara swamy images, subramanya swamy god mantra, Lord Murugan, naga sarpam, snake.

Comments