కపిలగోవు విశిష్ఠతను ధర్మరాజుకు వివరిస్తూ భీష్ముడు...| Kapila Cow History in Telugu - Importance and their role in Hinduism.

కపిలగోవు విశిష్ఠతను ధర్మరాజుకు వివరిస్తూ భీష్ముడు...

"ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మ దేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతము యొక్క సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి.

Also Readఅన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు

ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. 

ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమ శివుడి తల మీద పడింది. పరమ శివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. 

ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి 

"మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు" అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. 

పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. 

శివుడు "బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమై నవిగా భావించబడతాయి" అని వరం ఇచ్చాడు. 

అప్పటి నుండి కపిలగోవులు అనబడే ఎర్రటి గోవులను దానం ఇవ్వడం ఆనవాయితి అయింది. 

అలాగే ఇక్ష్వాకు కులములో సౌదాసుడు అనేవాడు జన్మించాడు. ఆయన పురోహితుడు వసిష్ఠుడు. ఒక రోజు సౌదాసుడు వశిష్ఠుడిని చూసి

"మహాత్మా ! ఈ లోకములో పవిత్రమైనది ఏది ?" అని అడిగాడు. 

వశిష్ఠుడు "సౌదాసా ! ఆవు పవిత్రమైనది. ఆవు హవిస్సుకు పుట్టినిల్లు. అన్ని జీవులకు గోవు ఆధారము. గోవులు ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చే పడవ. స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది.

Also Readకష్టాల నుంచి గట్టెక్కించే వేంకటేశ్వర వ్రతం సర్వాభీష్ట ప్రదాయకం

మానవులు తమ కున్న గోసంపదలో పదింట ఒక దానిని దానంగా ఇవ్వాలి. గోవును ఉదయం స్మరించి నమస్కరించడం అధికమైన పుణ్యం ప్రసాదిస్తుంది. ఆవు పేడ, ఆవు పంచితము పవిత్రమైనవి. కాని ఆవు మాంసము తినడం మహా పాపము. 

మానవులకు పీడ కలల వలన వచ్చే ఫలితం గోవును స్మరించిన నివారించ బడుతుంది. ఆవు పేడతో ఇల్లు శుభ్రం చెయ్యడం, ఆవు పంచితం ఔషధంగా తీసుకోవడం మంచిది. బ్రాహ్మణులు గోసంపద కాపాడుకుంటూ ఉంటారు. గోదానము వలన అనంతమైన సుఖాలు కలుగుతాయి" 

అని వశిష్ఠుడు సౌదాసుడికి గోవుల విశిష్ఠత గురించి చెప్పాడు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందినందున కపిల గోవు అతి శ్రేష్టమయినది అంటూ భీష్ముడు వివరించాడు.

kapila cow for sale in andhra pradesh, kapila cow cost, kapila govu palu, kapila cow images, kapila cow mythology, kapila cow wikipedia, kapila cow colour, kapila cow milk per day, కపిలగోవు, గోవు, kapila cow history in telugu

Comments