ఏయే రోజుల్లో ఏయే రంగు దుస్తులు ధరించాలి ? What color dress to wear on which days - 7 Lucky Colours for the 7 Days of Your Week
ఏయే రోజుల్లో ఏయే రంగు దుస్తులు ధరించాలి......!!
ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.
రంగులు మన భవిష్యత్తును మార్చేస్తాయా...? ఎవరైతే వీటిని నమ్ముతారో వారికి అవుననేదే సమాధానం. రోజులననుసరించి రంగులను ఎంచుకోండి. ఫలితం కనపడుతుంది...
సోమవారం :
సోమవారం అంటే చంద్రునికి ప్రతీక. కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.
మంగళవారం :
మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. సిందూరం గానీ.. ఎరుపు రంగు వస్త్రాలు.. ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
బుధవారం :
వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారంనాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
గురువారం :
గురువారాన్ని బృహస్పతి వారం అనికూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి.
శుక్రవారం :
శుక్రవారం దేవీ (అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.
శనివారం :
శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు గానీ నలుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
ఆదివారం :
ఆదివారంనాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితముంటుందంటున్నారు జ్యోతిష్యులు.
కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులమౌతుంటాము. దీనినే " కలర్ సైన్స్ " అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.
గతంలో పేరున్న గొప్పవారు, పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో మాత్రమే వీటిని పాటించేవారు. ఇది కాస్త చిన్న చిన్న పట్టణాలు, పల్లెలకుకూడా ప్రాకుతోంది. దీంతో చాలామందికి దీనిపై నమ్మకం కలుగుతోంది.
Famous Posts:
ఏయే రోజుల్లో ఏయే రంగు దుస్తులు ధరించాలి ? What color dress to wear on which days, Weekday colors, seven days seven colour, days and their spiritual colours, what colour to wear, lucky colors of the week, spiritual colors for days of the week
Comments
Post a Comment