లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల" | Benefits of Lotus Seed Maha Lakshmi Tamara Mala

లక్ష్మీదేవి అనుగ్రహ మాల "తామరమాల"

తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను ‘కలువలు’ అని కూడా అంటారు. తామరలకు ‘పుత్రజీవి’ అను పేరు కలదు. తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకొని కొద్దిగా వేడి చేసిన ఆవు పాలతో త్రాగవలెను. ఈ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును.

తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

స్పటికమాల, పగడాల మాలకంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

“ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా.”

అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి. చేతిలో ధనం నిలబడని వారు తామరమాలతో జపం చేసిన ధరించిన ఐశ్వర్యం, ధనం, స్ధిరాస్తులు పొందగలరు. తామరమాలతో అమ్మవారి పఠాన్ని గాని, విగ్రహాన్ని గాని, శ్రీయంత్ర మేరువుని గాని అలంకరించిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. సకలైశ్వర్య ప్రదాయిని, శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. మహాలక్ష్మిని కమలవాసిని అని కూడా అంటారు.

వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్య వలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు శుకాశ్రామాన్ని చేరి స్వర్ణముఖీ నదీ తీరాన సరోవరం నిర్మించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మ పురాణం తెలుపుతుంది.

పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జన్మించిన పద్మావతి లేదా అలమేలు మంగ. తమిళంలో అలర్‌ అనగా పువ్వు. మేల్‌ అనగా పైన. మంగై అనగా అందమైన స్త్రీ - అలమేలు అనగా పద్మంలో ప్రకాశించున సుందరి. చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలెన స్త్రీమూర్తి అని అర్థం.

సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.

తామర విత్తనాలను పద్మ, కమల, లోటస్ విత్తనాలని కూడ అంటారు. లక్ష్మీదేవి స్వరూపమైనతామర విత్తనాలు సహజ సిద్దమైనవి. తామరవిత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు, పటాలకు, శ్రీచక్రాలకు అలంకరించటం మంచిది.

తామరమాలను జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు మెడలో దరించటం గాని, జపంచేయటం గాని చేస్తే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి.

తామర విత్తనాలు లక్ష్మీ, శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి. తామర విత్తనాలు, తామరమాలతో పూజ చేస్తే దనాభివృద్ధి కలుగుతుంది.

జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు, గొడవలు, అపోహలు ఉంటాయి. ఇలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి భాదలు ఉండవు.

దీపావళి రోజున "ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా". అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి.

Famous Posts:

Tags : తామరమాల, లక్ష్మీదేవి, Lotus Seed Maha, Tamara Mala, Thamara Mala Benefits, Thamara Mala Gold, Tamara Mala Benefits in Telugu

Comments