చంద్ర గ్రహణం తేదీ, సమయం, సూతక కాలం | Chandra Grahan November 8 (2022) Date & Time Lunar Eclipse 2022

చంద్ర గ్రహణ సమయం..

కార్తీక పౌర్ణమి నాడే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఇది రెండో చంద్ర గ్రహణం. చంద్రగ్రహణం వచ్చే నెల రెండవ వారంలో నవంబర్ 8న సంభవిస్తుంది. చంద్రోదయంతోనే గ్రహణం ప్రారంభమవుతుంది.

సాయంత్రం 05:32 గంటలకు మొదలైన చంద్రగ్రహణం సాయంత్రం 06:18గంటలకు ముగుస్తుంది. స్థానికంగా స్థానిక గ్రహణం వ్యవధి – 45 నిమిషాల 48 సెకన్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇది పాక్షిక చంద్రగ్రహణం. ఇంత సుదీర్ఘకాల పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడటం 580 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.

భారతదేశంతో పాటు, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఈశాన్య యూరప్  దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

ఈ చంద్రగ్రహణం యొక్క సూతక కాలం నవంబర్ 08 ఉదయం 09.21 నుండి ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 06:18 గంటలకు గ్రహణంతో ముగుస్తుంది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం అనేది ఒక అశుభకరమైన సంఘటన. ఇది మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గ్రహణ కాలంలో ఆలయాల తలుపులు మూసి ఉంటాయి. గ్రంథాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం తినడం నిషిద్ధం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లుకోవాలి.

నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏ రాశుల వారికి లాభం.. ఏ రాశుల వారికి నష్టం?

Tags : చంద్రగ్రహణం, కార్తీకపౌర్ణమి, Chandra Grahan, Chandra Grahan 2022, Chandra Grahan 2022 Time, Lunar Eclipse 2022

Comments