కార్తీకమాసంలో పాదరస శివలింగ పూజా మహిమ? Secrets Of Padarasa Lingam Pooja Vidhanam

కార్తీకమాసంలో పాదరస లింగం విశిష్టత.

పాదరస లింగాన్ని పూజా మందిరంలో ఉంచి పూజించవలెను. మహాశివరాత్రి, కార్తీక మాసం రోజు ఈ లింగాన్ని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

శ్లో!! వైద్యాయ రసలింగం యో భక్తియుక్తస్సమర్పయేత్!

జగత్రయేపి లింగానాం పూజాఫలమవాప్నుయాత్!!

‘పారదలింగ’ మనగా పాదరస లింగము. దీనిని యింకా ‘రసలింగ’ మనియు, ‘తేజోలింగ’ మనియు చెప్పుదురు. వేదపరముగా పాదరసము ‘శివుని బీజము’ నుండి వచ్చినదని చెప్పబడినది. ఈ లింగము చాలా స్వచ్ఛమైనది, శుభకరమైనది. బ్రహ్మపురాణము నందు "పాదరస లింగము’ను సేవించిన ప్రపంచ పరమార్థముల నొందుటయే గాక, ముక్తిని పొందుదురని చెప్పబడినది. 

బ్రహ్మహత్యాపాతకము కూడా నశించునని దీనిని పూజా గృహము నందు ఎర్రని వస్త్రం పైన ఉంచి పూజించవలెనని చెప్పబడింది. పాదరసమును ఆయుర్వేద శాస్త్రరీత్యా కుందనపు రేకులు, నిమ్మపండు రసం తో స్వేదనం చేసి ఘనీభవింపజేసి లింగ రూపముగా చేయుదురు. 

ఆధునిక శాస్త్రములో పాదరసమును ‘Mercury’ అని అందురు. పాదరస శివలింగాన్ని పూజిస్తే మృత్యువుని జయించవచ్చు. ప్రాణాంతకరమైన జబ్బులను నివారిస్తుంది. అన్నిరకాల పాపాలను హరిస్తుంది. ఇబ్బందులను, భాదలను సులభంగా అదిగమించవచ్చు. భార్యా భర్తల మధ్య అన్యోన్నతను పెంచుతుంది. పిల్లలకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. నవగ్రహ బాధలు, నరదృష్టి బాధలు లేకుండా చేస్తాయి. గ్రహ బాధలను నివారిస్తుంది.

హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం శివుని లింగాలు చాలా రకాలు వున్నాయి. వాటన్నింటిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తూ పూజించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వుంటుంది. అటువంటి శివలింగాలలో పాదరస శివలింగం కూడా ఎంతో ముఖ్యమైంది. 

శివలింగాలలోనే ఈ పాదరస శివలింగం ఎంతో శక్తివంతమైంది. ఈ పాదరస శివలింగాన్ని శాస్త్రయుక్తంగా, మంత్రాలతో, విధి విధినాలతో పూజిస్తే గృహాల్లో వున్న కష్టాలన్నీ తొలగిపోయి, ఎటువంటి లోటు లేకుండా అన్ని కోర్కెలను ఆ పరమేశ్వరుడు తీరుస్తాడని ప్రాచీనకాలం నుంచి పురోహితులు, జ్యోతిష్య నిపుణులు, పండితులు విశ్వసిస్తూ వస్తున్నారు.

పాదరస లింగాన్ని సోమవారం రోజు గాని, కార్తీకమాసంలో గాని ప్రతిష్ఠించి పాలతో అభిషేకించాలి. “ఓం ఐం శ్రీం క్లీమ్ హ్రీం పాదరసాంకుసాయనమః” అనే ద్వాదశ మంత్రాన్ని ఉచ్చరిస్తూ గంధ పుష్పాలతో అలంకరించి ధ్యాన ఆవాహనాది షోడోపచారములతో పూజించిన వారికి కోటి శివలింగాలను పూజించిన ఫలమును, బ్రహ్మ హత్యాపాతకాలు, గోహత్యా పాతకాలు పాదరస లింగ దర్శనం మాత్రం చేతనే నశించును.

పాదరస శివలింగాన్ని పూజించడానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణ బేధం లేదు. స్త్రీ పురుష అనే వ్యత్యాసం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేదు. తమ కష్టాలు తీరి, సుఖంగా, సంతోషంగా ఉండటం కోసం ఎవరైనా పాదరస శివ లింగాన్ని కొలవవచ్చు.

పాపాలు పాదరస శివలింగ పూజ వలన తొలగిపోతాయి. పాపాలు నశించబడిన జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అందుకే అంకిత భావంతో పాదరస శివలింగాన్ని అర్చించాలి. ఆ దేవదేవుడి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలి. పాదరస శివ లింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు వుండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఈ లింగం చిన్నగా వున్నా చాలా బరువుగా వుంటుంది. దీన్ని ఇంట్లో వుంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు. 

మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది. ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవు తాయని నమ్మకం.

Famous Posts:

Tags : పాదరస లింగం, padarasa lingam benefits, padarasa lingam temple, padarasa shiva lingam puja benefits in telugu, padarasa in science, padarasa, shiva lingam

Comments