విద్యార్థులకు గుడ్ న్యూస్ | AP Jagananna Vidya Kanuka Kits Scheme 2020


విద్యార్థులకు గుడ్ న్యూస్. 
జగనన్న విద్యా కానుకనిధుల విడుదల" జగనన్న విద్యా కానుక కింద గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫార్మ్ లు అందించేందుకు 80 కోట్ల 43 లక్షల రూపాయల విడుదలకు ఏపీ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది. ఈ అకడమిక్ ఇయర్ కు గాను ఈ రెండు తరగతుల స్టూడెంట్స్ కు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి యూనిఫార్మ్ జత కుట్టేందుకు రూ. 80 చొప్పున చెల్లించాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. సమగ్ర శిక్షణ పథకం కింద ఈ యూనిఫార్మ్ జతలను ప్రభుత్వం..విద్యార్థులకు సరఫరా చేయనుంది.


ఆరు రకాల వస్తువులతో కిట్లు కాగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ అందరికీ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి జగనన్న విద్యా కానుక కింద ఆరు రకాల వస్తువులతో కూడిన స్పెషల్ కిట్లను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే 42 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ఈ కిట్లను పొందనున్నారు. ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, షూ- 2 జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్, బెల్టు ఉంటాయి. యూనిఫామ్‌ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
Related Posts:


కరోనా తెచ్చిన మార్పులు గమనించారా | corona changes in indian culture
కరోనాతో నష్టపోయారా...అయితే ఇలా చేయండి రూ. 10 లక్షల కోసం
ఆధ్యాత్మిక పుస్తకాలూ అన్ని ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేస్కోండి
సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ మీకు కావాలి అంటే ఈ నంబర్స్ కి ఫోన్ చేయండి
jagananna vidya deevena status, jagananna vasathi deevena payment status, AP Jagananna Vidya Kanuka, AP Jagananna Vidya Kanuka Kits Scheme 2020, 

Comments