కూతురి_ప్రేమ - The Importance of Father Daughter Relationships - Inspirational Storiesr Relationships

కూతురి_ప్రేమ 

పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు

చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు

ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు,

Also Read : సృష్టి రహస్య విశేషాలు - సృష్టి  ఎలా  ఏర్పడ్డది

భార్య,నలుగురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల,భార్యను పిల్లలను కష్ట పడి జీవితంలో ఒక మంచి స్థాయికి.తెచ్చి న్యాయంగా సంపాదించినదానితోనే పిల్లలందరిని మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్ళి చేశాడు...

మృదు స్వభావం ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు.నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి..

అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే, ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు,ఆగండి ఆగండీ నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు. ఇలాంటి టైం లో ఏంటి ఇది అని అడిగారు అంతలో ఒక పెద్దాయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు...

ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్య పోయారు, నాకు "పదిహేను లక్షలు అప్పు ఉన్నాడు" అని చెప్పాడు.అందరూ గుస గుస మాట్లాడుకున్నారు. తరువాత అందరూ అన్నారు ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదాం అన్నారు. పెద్దవాళ్ళందరు,"లేదు లేదు"

ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను, అని పట్టు బట్టాడు. మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు......

అయితే నలుగురు ఒప్పుకోలేదు.అందరికి 

చాలా విచిత్రం అనిపించింది. ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరు  చర్చించుకుంటున్నారు,

అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది....

 ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్నా కూతురు, ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది....

ముందు అంత్యక్రియలు జరగనియ్యండి నా తండ్రికి,  మానాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది, 

తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు.....

నగలను తీసుకున్న ఆవ్యక్తి  లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు,

"తీసుకో తల్లి నీ నగలు ఈ పదిహేను లక్షలు"

అని చెప్పాడు అందరూ అక్షర్యపోయారు,అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు నిజానికి చెప్పాలంటే...

"ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు"

నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు.మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను.

అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమనిపించింది.

Also Readకొబ్బరి నూనెతో దైవారాధన చేస్తే కలిగే శుభఫలితాలు

అందుకే ఈ నాటకమాడాను. తీసుకో బేటా,అని చెప్పి వెళ్ళిపోయాడు,తల దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు. తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చుపెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో.....

మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది......

ఇప్పటి కాలంలో అలా లేదు అందరూ సమానంగా ఉన్నారు.... అమ్మాయిలు కూడా అమ్మానాన్నలని ప్రేమిస్తున్నారు వాళ్లకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు..

Fathers and Daughters, Father, Daughter, father-daughter relationship problems,  father and daughter relationship

Comments